బంగారం అన్నంతనే భారతీయ మహిళలు చప్పున గుర్తుకు వస్తుంటారు. దానికి వారిచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చేతిలో కాస్త డబ్బులు ఉంటే చాలు.. మొదటి ప్రాధాన్యత బంగారం కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే. ప్రపంచ స్వర్ణ మండలి సింఫుల్ గా చెప్పాలటే డబ్ల్యూజీసీ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారతీయ మహిళల్లో బంగారం విషయానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం భారతీయ మహిళల్లో 60 శాతం మందికి బంగారు ఆభరణాలు ఉన్నట్లు తేల్చారు. పండుగ.. పెళ్లి.. కార్యక్రమం ఏదైనా బంగారానికి భారీ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 37 శాతం మంది మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. బంగారు నగలకు భారత మార్కెట్ అత్యంత కీలకమని చెప్పిన నివేదిక.. ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో డిజైనర్ దుస్తులు.. చీరల తర్వాత స్థానం బంగారానిదేనని తేల్చారు.
దేశంలోని మహిళల్లో ఇప్పటివరకూ బంగారాన్ని కొనుగోలు చేయని వారు 37 శాతం మంది ఉంటే.. వారిలో 44 శాతం మంది మహిళలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయితే.. పట్టణ ప్రాంతానికి చెందిన వారు 30 శాతంగా తేల్చారు. భవిష్యత్తు పట్ల భద్రతతో పాటు.. సంపద విలువ పెంచుకునేందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తారని పేర్కొంది. సమాజంలో తమ గౌరవాన్ని పెంచుకోవటానికి బంగారు ఆభరణాలు ధరిస్తారని చెప్పిన నివేదిక మరో కొత్త విషయాన్ని ప్రస్తావించింది.
ఇటీవల కాలంలో యువ మహిళలు.. అందునా.. నగర, పట్టణ ప్రాంతానికి చెందిన వారిలో బంగారంపై మోజు తగ్గుతుందని చెప్పింది. ఇలాంటి వారి వయసు 18-24 మధ్య ఉన్నట్లుగా చెప్పింది. ఇలాంటివారిలో గత ఏడాదిలో 33 శాతం మంది బంగారాన్నికొనుగోలు చేసినా.. రానున్న రోజుల్లో కొనుగోలు చేసే అవకాశం తక్కువని చెప్పింది.
భారత్ మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే ఫ్యాషన్ ఉత్పత్తుల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో డిజైనర్ దుస్తులు లేదంటే చీరలు తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. మూడో స్థానంలో వెండి వస్తువులు.. నాలుగో స్థానంలో లగ్జరీ కాస్మెటిక్ లు ఉన్నాయి.ఐదో స్థానంలో డిజైనర్ యాక్సెసరీస్ ఉన్నాయి. తక్కువ మోజు ఉన్న వాటిల్లో వజ్రాభరణాలు.. ఖరీదైన గడియారాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.