షాక్: 38 మందిని పిట్టల్లా కాల్చేసిన ఆ దేశ సైన్యం

Update: 2021-03-04 07:54 GMT
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించటం.. ఆందోళనలు చేపట్టటం మామూలుగా జరిగేదే. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు పోలీసుల్ని, ఆర్మీని వినియోగిస్తారు. లాఠీఛార్జి.. వాటర్ కేనింగ్.. లేదంటే రబ్బరు బుల్లెట్లు వినియోగించటం లాంటివి చేయటం మామూలే. ఇందుకు భిన్నంగా రంగంలోకి దిగీ దిగిన వెంటనే.. కాల్పులు స్టార్ట్ చేయటం... దేశ పౌరుల్ని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

మయన్మార్ లోచోటు చేసుకున్న తాజా పరిణామాలు మారణహోమాల్ని తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనాకారులపై దారుణమైన రీతిలో దాడి చేస్తోంది. చివరకు గాయపడిన వారిని.. జరుగుతున్న పరిణామాల్నికవరేజీ చేస్తున్న మీడియా మీదా దాడి చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 38 మందిని ఆ దేశ సైన్యం కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. పోలీసులు రబ్బరు బుల్లెట్లను వినియోగిస్తే.. సైన్యం రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆందోళనకారులపై బుల్లెట్ల వర్షం కురిపించటంతో.. భారీగా ఆందోళకారులు ప్రాణాలు విడిచారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే మయన్మార్ సైనికులు కాల్పులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా మరణించిన వారిలో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దారుణమైన విషయం ఏమంటే.. ఆందోళనతో సంబంధం లేని వారిపైనా పోలీసులు.. సైన్యం విరుచుకుపడుతూ ఆరాచకంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  
Tags:    

Similar News