భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విస్తరిస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 3900 కొత్త కేసులు నమోదు కాగా.. 195 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,433కు చేరగా.. మరణాల సంఖ్య 1568కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా, ప్రస్తుతం దేశంలో 32,138 యాక్టివ్ కేసులు ఉండగా... 12,727 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 1020 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముంబై నగరం కరోనా హాట్ స్పాట్ గా మారింది. దీంతో ముంబై నగరంలో మే 17 వరకు సెక్షన్ 144 విధించారు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ మూడోదశ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్‌డౌన్ ను పొడిగించిన కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలించింది.
ఇకపోతే , ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 2.52 లక్షలు దాటింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1015 కరోనా మరణాలు సంభవించాయి. గత నెల రోజుల్లో అమెరికాలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం.