పిల్ల‌లే అయితే ఇంత దారుణం చేస్తారా?

Update: 2015-11-27 12:23 GMT
దేశంలోని చ‌ట్టాల్ని అర్జెంట్ గా మార్చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తాజా ఉదంతం వింటే.. చ‌ట్టాల్ని మార్చేయాల‌న్న మాట మ‌న‌సులోకి రాకుండా పోదు. 18 ఏళ్ల వ‌య‌సు నిండ‌ని వారిని పిల్ల‌లుగా భావిస్తూ.. ఆ ముసుగులో అంత‌కంత‌కూ దారుణాలకు పాల్ప‌డుతున్న పిశాచాల్లాంటి పిల్ల‌ల తీరు చూస్తే భ‌యంతో వ‌ణికిపోవాల్సిందే. ముంబ‌యిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘ‌ట‌న చూస్తే.. వాళ్ల‌ను పిల్ల‌లుగా చెప్ప‌టానికి మ‌న‌సున్న ఎవ‌రూ ఒప్పుకోనే ఒప్పుకోరు. ఇంత‌కీ.. ఆ దుర్మార్గ ఘ‌ట‌న చూస్తే..

ముంబ‌యిలోని 15 ఏళ్ల ఒక మైన‌ర్ బాలిక‌ను.. కంబైన్డ్ స్ట‌డీస్ కోసం ఆమె తోటి పిల్ల‌లు పిలిచారు. తండ్రి లేని ఆ అమ్మాయి అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటోంది. స్నేహితులు క‌దా అని న‌మ్మి వెళ్లిన ఆ అమ్మాయిని.. స్నేహితుల ముసుగులో ఉన్న 15 ఏళ్ల న‌లుగురు అబ్బాయి బ‌ల‌వంతంగా సామూహిక అత్యాచారం చేశారు. తాము చేసిన దారుణాన్ని వీడియో తీశారు. ఆ అమ్మాయి కానీ గొంతు విప్పి నిజం చెబితే.. దాన్ని ఆన్ లైన్ లో పెట్టేస్తామ‌ని చెప్పి బెదిరించి.. నోరు విప్ప‌కుండా చేశారు.

అయితే.. ఈ దుర్మార్గులు.. తాము చేసిన అకృత్యానికి చెందిన వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేయ‌టం.. అది కాస్త వాట్స‌ప్ లో చ‌క్క‌ర్లు తిరుగుతూ.. బాలిక అత్త వ‌ద్ద‌కు చేర‌టం.. దాన్ని చూసి ఆమె షాక్ తిని.. బాలిక‌ను నిల‌దీయ‌టంతో అస‌లు విష‌యాన్ని వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పుకొచ్చింది. న‌వంబ‌రు 8న ఈ దారుణం జ‌రిగితే దాదాపుగా రెండు వారాల త‌ర్వాత కానీ పిశాచులు చేసిన పాపం బ‌ద్ధ‌లు కాలేదు.

దీంతో.. బంధువుల‌తో క‌లిసి.. ఆ బాలిక‌కు జ‌రిగిన అన్యాయాన్ని పోలీసుల‌కు పిర్యాదు చేయ‌టంతో.. ఆ కుర్రాళ్ల‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఇంత‌టి దారుణానికి పాల్ప‌డిన వారి వ‌య‌సు 18 సంవ‌త్స‌రాల లోపు కావ‌టంతో వారిని బాల నేర‌స్తులుగా గుర్తించి.. జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. ఇంత రాక్ష‌సానికి పాల్పిడిన వారిని పిల్ల‌లుగా లెక్క‌లోకి తీసుకోవ‌టం స‌రైన‌దేనా?
Tags:    

Similar News