ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి క్యామెడీ కబుర్లు చెప్పి.. ప్రజలను నవ్వించేశారు. రాజ్‌ఘాట్‌లో తాజాగా ఆయన చేపట్టిన మౌన దీక్ష ముగిసింది. విభజన హామీల అమలు కోసం పాల్ 4 గంటలు దీక్ష చేశారు. దీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక మంది పెద్దలను కోరినా హామీలు అమలు కాలేదన్నారు. దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష చేశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రజాప్రయోజనాలు ముఖ్యం కాదని విమర్శించారు.
20న మరోసారి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
మౌన దీక్షకు సీఎం కేసీఆర్, సీఎం జగన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. దీక్షకు వచ్చే నేతలకు ప్రత్యేకంగా ఢిల్లీకి విమానాలు ఏర్పాటు చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేద్దామని పాల్ పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని మోడీ అమలు చేయడం లేదని పాల్ మండిపడ్డారు. విభజన హామీలు అమలు పరచడం కాలేదు కాబట్టి రాజ్ ఘాట్‌లో మౌన దీక్ష చేసిన్నట్లు తెలిపారు.
నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించాలని సూచించానని.. అయినా.. ఎవరూ రాలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు 2 కోట్ల 10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని ఆయన తెలిపారు.
విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లక్ష 65 వేల కోట్ల మేర బకాయలు ఉన్నాయని కేఏ పాల్ పేర్కొన్నారు.