ఫేస్‌ బుక్ త‌ప్పుడు పోస్ట్‌ కు 5 ల‌క్ష‌ల డాల‌ర్ల ఫైన్‌

Update: 2017-04-01 10:41 GMT
ఫేస్‌ బుక్ పోస్టుల‌పై ఒకింత జాగ్ర‌త్త వ‌హించండి! ఎందుకంటే సోష‌ల్ మీడియా పోస్టులు న్యాయ‌స్థానానికి ఆధారాలుగా మారుతున్నాయి. ఇబ్బందిక‌ర‌మైన అంశాల్లో జ‌రిమానాలు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. తాజాగా అలాగే జ‌రిగింది. ఫేస్‌బుక్‌లో త‌ప్పుడు పోస్ట్ రాసిన ఓ మ‌హిళ‌కు అమెరికా జ‌డ్జి భారీ జ‌రిమానా విధించారు. ఏకంగా 5 ల‌క్ష‌ల డాల‌ర్లు చెల్లించాలంటూ దిమ్మ‌తిరిగిపోయే తీర్పిచ్చారు.

త‌న స్నేహితురాల‌ను టార్గెట్ చేస్తే జాక్వ‌లిన్ హ‌మ్మండ్ రెండేళ్ల క్రితం ఫేస్‌ బుక్‌ లో ఓ పోస్ట్ రాసింది. దానిపై స్నేహితురాలు డావ్నీ డ‌య‌ల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ ఫేస్‌ బుక్ పోస్ట్‌ పై డావ్నీ డ‌య‌ల్ ప‌రువున‌ష్టం కేసు న‌మోదు చేసింది. అయితే కేసును విచారించిన బ‌న్‌ కూంబ్ కౌంటీ న్యాయ‌మూర్తి ఫేస్‌ బుక్‌ లో త‌ప్పుడు పోస్ట్ రాసిన హ‌మ్మండ్‌ కు అయిదు ల‌క్ష‌ల డాల‌ర్ల భారీ జ‌రిమానా విధించారు. ఆ ఫైన్‌ ను చెల్లించేందుకు హ‌మ్మండ్ అంగీక‌రించింది. వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు స్నేహితులు గ‌తంలో ఓ రేడియోకు ప‌నిచేసేవాళ్లు. అయితే ఆ రేడియో సంస్థ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. కాగా, కొన్నేళ్ల క్రితం డావ్నీ డ‌య‌ల్ కొడుకు అనుమానాస్ప‌ద స్థితిలో మర‌ణించాడు. ఆ మ‌ర‌ణ‌వార్త‌కు సంబంధించి హ‌మ్మండ్ రాసిన పోస్ట్ వివాదాస్ప‌ద‌మైంది. దానిపై డ‌య‌ల్ కేసు వేయ‌డంతో జ‌డ్జి ఈ తీర్పును ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News