భారతీయులకు నిజంగా ఇది షాకిచ్చే వార్త. ఎందుకంటే మన జీతాలు - మన సంపాదన - వచ్చే ఆదాయం అంతా బ్యాంకుల్లోనే దాచేస్తాం. నెలవారీ సంపాదన అంతా బ్యాంకుల్లో ఉంటుంది. అలాంటి మన డబ్బుకు ఇప్పుడు ఎసరు వచ్చేసింది.
దాదాపు 5 లక్షల మంది భారతీయుల డెబిట్/క్రెడిట్ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయినట్టు సంచలన వార్త బయటకు వచ్చేసింది. ఒక్కో డెబిట్ కార్డును రూ.5వేలు - ఒక్కో క్రెడిట్ కార్డును రూ.10వేలకు అమ్మేసినట్టు తెలిసింది.
జోకెర్స్ స్టాష్ అనే వెబ్ సైట్ భారతీయుల క్రిడిట్/డెబిట్ కార్డుల డేటాను అమ్మకానికి పెట్టడం దుమారం రేపింది. ఈ డేటాలో మన కార్డు గడువు తేదీలు, కార్డ్ నంబర్స్, కార్డుదారుల పేర్లు - సీవీవీ/సీవీసీ - ఈమెయిల్ - అడ్రస్ లు కూడా ఉన్నాయట.. మొత్తం 4,61,976 కార్డులను రూ.30 కోట్లకు అమ్మినట్టు సమాచారం. దీంతో మీ మీ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడో పోతాయో తెలియని పరిస్థితి. ఈ వార్త ఇప్పుడు భారతీయ బ్యాంకు వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తోంది.