భారతదేశమంతా... గణతంత్ర సంబురాల్లో ఉండగా....ఈశాన్య రాష్ట్రమైన అసాంలో కలకలం రేగింది. అసోంలోని దిబ్రూగఢ్ - చరైదేవ్ - దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన నిషేధిత తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం-ఇండిపెండెంట్’(యూఎల్ ఎఫ్ ఏ-ఐ) చేసిన చర్యగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ భాస్కర్ జ్యోతి మహంత్ పేర్కొన్న వివరాల ప్రకాకరం, అస్సాంలోని 37వ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రాహం బజార్ లో ఆదివారం తెల్లవారుజామున తొలుత రెండు గ్రెనేడ్లు పేలాయి. అనంతరం అరగంట వ్యవధిలో ఓ గరుద్వారా వద్ద మరో పేలుడు సంభవించింది. దిబ్రూగఢ్ - చరైడియో జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ పేలుళ్ల ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన తెలిపారు. కాగా - రెండు వేర్వేరు జిల్లాల్లో - స్వల్ప వ్యవధిలోనే మూడు శక్తిమంతమైన గ్రెనేడ్ల పేలుళ్లు అస్సాంను ఉలిక్కిపడేలా చేశాయి. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు కూడా భద్రతా బలగాలు గుప్పిట్లో ఉన్నాయి.
కాగా, ఈ పేలుళ్ల వెనుక భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారత్ లోని పలు తీవ్రవాద సంస్థలు గణతంత్ర - స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బహిష్కరణకు పిలుపునిస్తూ వస్తున్నాయి. ఈ సంస్థలే ఘటనకు పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనల్లో అత్యధికం దిబ్రూగఢ్ - చరైడియా జిల్లాల్లోనే పెద్ద ఎత్తున చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ రకమైన పరిణామాలు కారణం కావచ్చునని సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, గ్రెనేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వాటిని అమర్చారు? కుట్ర కోణం ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.