5జీ టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకునేదెప్పుడు.?

Update: 2022-01-26 03:37 GMT
సాంకేతికత విషయంలో ప్రపంచం రోజుకో కొత్త పుంత తొక్కుతుంది. ఈ క్రమంలోనే అన్నీ రంగాల్లో మానవుడు తనను తాను ప్రతీ దానిలో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఏకంగా నింగికి నేలకు నిచ్చెనలు వేశాడు. అయితే ఈ పరిణామ క్రమంలోనే మొబైల్ సాంకేతికతను కూడా మరింత ముందుకు తీసుకుని పోయాడు. దీని ఫలితంగా మనం ప్రస్తుతం ఉపయోగించే నాలుగో తరం సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీనికి ముందుగు కూడా రెండో తరం సాంకేతికత, మూడో తరం సాంకేతికతను విజయవంతంగా అందిపుచ్చకున్నాము మనం. అయితే మన దేశంలో మాత్రం ఈ సాంకేతికత ఇంకా అందని దాక్షా లానే ఉంది. ఇప్పటికే మనలో చాాలా మంది 5జీ టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నా సరే.. భారత్ లో ఈ సాంకేతికత పరిజ్ఞానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది దానిపై ఎవరి దగ్గరా క్లారిటీ లేదు.

ఐదో తరం సాంకేతికతను చాలా దేశాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. కానీ భారత్ లో మాత్రం అందుబాటులో లేదు. దీనిని మన దేశంలో కూడా ప్రవేశ పెట్టాలని కేంద్ర ఇప్పటికే సన్నాహాలు చేసింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే అడుగులు కూడా వేసింది. 5జీ ని వినియోగదారులకు అందించాలని జియో, ఎయిర్ టెల్ , ఐడీయా సంస్థలు చాలా ఆత్రుతగా ఉన్నాయి. ముఖ్యంగా జియో అయితే ఎప్పుడెప్పుడా అని చూస్తోంది. ఈ సాంకేతికతకు మారడానికి జియోకు పెద్ద ప్రయాస అక్కర్లేదని నిపుణులు చెప్పుతున్నారు. దీనికి గల కారణం.. జియోకు ఉన్న టవర్లు అన్నీ 4జీ వే. దీంతో 5జీ కి మారాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. దీనితో పాటు ఎయిర్ టెల్ కూడా ఈ క్రమంలో ముందుంది. ఒకవైపు నష్టాలను భరిస్తూనే ఐడియా కూడా 5 తరం సాంకేతికత వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని నెలలోనే ఈ సంస్థలు 5జీ ట్రైల్స్ ను చేపటనున్నాయి. కానీ గతంలో మాదిరిగా ఈ సాంకేతకతకు పెద్ద పెద్ద టవర్లు అవసరం లేదు. కానీ పెద్ద సంఖ్యలో టవర్లు కావాల్సి ఉంటుంది. అయితే ఈ టవర్లు జస్ట్ లైక్ మనం వీధుల్లో చూస్తున్న వైఫై రూటర్ల లాంటివి. మన దేశం మొత్తానని కవర్ చేయాలి అంటే సుమారు 8 లక్షలకు పైగా ఇలాంటివి కావాల్సి ఉంటుంది.

5జీ టెక్నాలజీ భారత్ లో అందుబాటులోకి వస్తే మొబైల్ టెక్నాలజీలో ఇది ఒక కీలక ఘట్టంగా నిలువనుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశం మనది. అందుకే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ ఆశ చూపి వినియోగదారులకు ఈ సాంకేతికత ఉన్న మొబైల్సు ను విక్రయించాయి. ఇలాంటి ఫోన్లు భారత్ లో ప్రస్తుతం సుమారు 2.5 కోట్లకు పైగా ఉన్నాయంటే ఇంక ఆర్థం చేసుకోవచ్చు 5జీ ఫీవర్ ఎలా ఉందనేది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. 5జీ అందుబాటులోకి వస్తే మెయిన్ గా మారేది ఇంటర్నెట్ స్పీడ్. ఇప్పుడు నిమిషాల్లో అవుతున్న సినిమా 5జీ వస్తే క్షణాల్లోనే డౌన్లోడ్ అవుతుంది. ఇలాంటి సాంకేతికత  భారత్ లోకి రావాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయక తప్పదని నిపుణులు చెప్తున్నారు.
Tags:    

Similar News