ఫరక్కా ఎక్స్‌ ప్రెస్ కు ఘోర ప్ర‌మాదం...!!

Update: 2018-10-10 07:29 GMT
ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు ఉద‌యం ఘోర రైలు ప్ర‌మాదం సంభ‌వించింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి న్యూఢిల్లీ వెళుతోన్న‌ ఫరక్కా ఎక్స్‌ ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘోర ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్ప‌డంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న గురించి తెలియ‌గానే ఎన్‌ డీఆర్ ఎఫ్‌ బృందాలు హుటాహుగిన ప్రమాదస్థలానికి వెళ్లాయి. బోగీల‌లో ఇరుక్కున్న ప్ర‌యాణికుల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు స‌హాయ‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప‌ట్టాలు త‌ప్ప‌డానికి గ‌ల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆరు బోగీలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ - ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

రాయ్ బ‌రేలీ స‌మీపంలో ఉన్న హర చంద్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్ ఘట‌నా స్థలానికి చేరుకుంది. హైడ్రాలిక్ క‌ట్ట‌ర్ల సాయంతో బోగీల‌ను క‌త్తిరించి ప్ర‌యాణికుల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు స‌హాయ‌క సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు - తీవ్రంగా గాయపడిన వారికి 50వేల రూపాయల ఎక్స్‌ గ్రేషియాను  యోగి ఆదిత్య‌నాధ్ ప్రకటించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో అవ‌స‌ర‌మైన సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను  కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర‌విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా పీయూష్ అధికారుల‌ను ఆదేశించారు. అత్యవసర సమాచారం కోసం ఎమ‌ర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు అధికారులు ప్రకటించారు. ఈ రూట్లో ప్ర‌యాణించే రైళ్ల‌ను అధికారులు దారి మ‌ళ్లించారు. మ‌రి కొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.

Tags:    

Similar News