కరోనా: 6 ఆస్పత్రులు..200 కి.మీలు..గర్భిణి శిశువు మృతి

Update: 2020-04-29 08:30 GMT
సభ్య సమాజం తలదించుకునే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గద్వాల నుంచి వచ్చిన నిండు గర్భిణికి సమయానికి కాన్పు చేయకుండా 6 ఆస్పత్రులు తిప్పారు. పురిటినొప్పులతో దాదాపు 200కి.మీలు ప్రయాణించడంతో ఆ గర్భిణితోపాటు శిశువు కూడా మరణించిన దైన్యం హైదరాబాద్ లో వెలుగుచూసింది.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా అనే నిండు గర్భిణి కాన్పు కోసం భర్తతో కలిసి మొదట గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. . కానీ ఆమె కరోనా ఉందేమోనని 200 కి.మీలు తిప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని పేట్ల బురుజు దవఖానకు పంపించారు. అక్కడ మగ బిడ్డ పుట్టాడు. శ్వాస ఆడటం లేదని ఆ బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి పంపించారు. అక్కడ శిశువు మృతిచెందాడు.

ఇక పేట్ల బురుజు ఆస్పత్రిలో ఉన్న బాలింత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలింత జెనీలా చనిపోయింది.

చికిత్స అందకుండా మృతిచెందిన ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యి సుమోటోగా కేసు నమోదు చేసింది. సకాలంలో కాన్పు చేసి ఉంటే తన భార్య బతికేదని.. గద్వాల జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇలా ఆస్పత్రులకు తమను తిప్పారని మహిళ భర్త మహేందర్ వాపోవడం అందరినీ కంటతడి పెట్టించింది. భార్యను, బిడ్డను పోగొట్టుకున్నానని అతడు కన్నీల్లపర్యంతమయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలైపోయాయి.
Tags:    

Similar News