తరచూ తన మాటలతో.. చేష్టలతో వార్తల్లో నిలిచే సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి తాజాగా తాను నమ్ముకున్న తన సొంత సిబ్బంది నుంచే ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీకి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సాధారణంగా రాజకీయ ప్రముఖులు తమ వ్యక్తిగత సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంతో నమ్మకం ఉంటే తప్పించి వారికి పనిలో పెట్టుకోరు. ఇక.. వ్యక్తిగత సంరక్షకులు.. సిబ్బంది.. కారు డ్రైవర్ లాంటి వారి విషయంలో వినయం.. విధేయతకు మించి నమ్మకానికి పెద్దపీట వేస్తారు.
అలాంటిది.. సొంత కారు డ్రైవర్ చూపిన హస్తలాఘవంతో జేసీ అవాక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సొంత పని మీద విజయవాడకు వచ్చారు జేసీ. సచివాలయానికి వెళ్లిన ఆయన తిరిగి విజయవాడకు వచ్చి గాంధీనగర్ లోని ఒక హోటల్లో దిగారు. కారులో ఉన్న సూట్ కేసును హోటల్ గదిలో ఉంచాలన్నారు. సాయంత్రం ఆరు గంటల వేళలో సూట్ కేసు ఓపెన్ చేస్తే.. అందులో ఉండాల్సిన రూ.6లక్షల మొత్తం లేకపోవటంతో షాక్ తిన్నారు.
వెంటనే.. క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు సమాచారం అందించారు. సూట్ కేసును కారులో నుంచి హోటల్ రూంలోకి కారుడ్రైవర్ గౌతమ్ తీసుకొచ్చారని చెప్పటంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించిన పిమ్మట..కారులోని సీటు కవరులో డబ్బును దాచినట్లుగా డ్రైవర్ ఒప్పుకున్నాడు. దీంతో.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని జేసీకి అప్పగించారు. అంతా బాగుంది కానీ.. కీలకమైన డ్రైవర్ ఎంపికలో జేసీ అలా తప్పులో కాలేయటం ఏమిటి?