ఏపీలో కరోనా దాడి: ఒకే కుటుంబంలో ఏడుగురికి

Update: 2020-04-03 08:10 GMT
ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో ఏపీలో కరోనా బాగా విస్తరించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసిన బులెటెన్ తో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది. కొత్తగా నిన్న 38 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులోనే 8 ఉన్నాయి. కొత్త కేసుల్లో ఎక్కువ శాతం నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే కావడం గమనార్హం.

ఇక కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటేయడం సంచలనంగా మారింది. ఏపీలో అస్సలు ఉనికే లేని కరోనా ఢిల్లీ ప్రార్థనలతో తర్వాత బాగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ వెళ్లివచ్చిన వారికే కరోనా ఎక్కువగా నిర్ధారణ అవుతోంది.

తాజాగా నిన్న ఒక్కరోజే ఏపీలో 38 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా విజయవాడలోనూ కరోనా కలకలం మొదలైంది. ఏకంగా ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది.

విజయవాడలో ఒకే కుటుంబంలోని అందరికీ కరోనా సోకడం వెనుక వీరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి రావడమేనని తెలుస్తోంది. గుంటూరుతోపాటు కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.


Tags:    

Similar News