స్వచ్ఛభారతా...? అదెక్కడ!!!

Update: 2015-09-18 07:05 GMT
 ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై పట్టణ ప్రజలు సంతృప్తిగా లేరు. మోడీ ప్రధాని అయిన తరువాత చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఇంతవరకు ఫలితాలు లేవన్నది ప్రజల అభిప్రాయం. దేశంలోని మూడొంతుల మంది ప్రజల అభిప్రాయం ఇదేనని ఓ సర్వేలో తేలింది. లోకల్ పోల్స్ అనే సంస్థ ఆన్ లైన్ లో సర్వే చేపట్టింది. ఇందులో 3 లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో 71 శాతం మంది స్వచ్ఛభారత్ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడంలో పురపాలక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని మెజారిటీ ప్రజల అభిప్రాయపడ్డారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడానికి ముందు, ఇప్పుడు కూడా పట్టణాలు, నగరాల్లో పెద్దగా తేడా ఏమీ రాలేదని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.

ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఏమాత్రం నమ్మకం ఏర్పడలేదని ఈ సర్వే రుజువు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరోవైపు దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కు అంబాసిడర్లను పెట్టినా వారివైపు నుంచి ఈ కార్యక్రమానికి ఎలాంటి తోడ్పాటు లేదు. దీంతో ఈ కార్యక్రమ అమల్లో ప్రధాని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags:    

Similar News