వైరస్ వ్యాప్తి కొన్ని దేశాల్లో తీవ్రంగా ఉంది. భారత్ తో పాటు అమెరికా, రష్యా, జర్మనీ తదితర దేశాల్లో తీవ్ర రూపం దాల్చింది. జర్మనీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలినాళ్లలో ఆ దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జర్మనీలో 1.90 లక్షలకుపైగా కరోనా కేసులు నిర్ధారణ కాగా.. దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా (ఎన్ఆర్‌డబ్ల్యూ)లోని ఓ కబేళాలో పనిచేసే 730 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. గ్యుటేర్స్‌లోహ్ జిల్లాలోని టోనీస్ గ్రూప్ మీట్ ప్యాకింగ్ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. వీరితో సంబంధం ఉన్న మొత్తం 7 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆ జిల్లాలో జూన్ 29వ తేదీ వరకు పాఠశాలలు, డే కేర్ సెంటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కేసులు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉండడంతో నాలుగైదు రోజుల్లో 5 వేలకుపైగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ పరీక్షల్లో మరికొంతమందికి వైరస్ సోకి ఉండవచ్చని అక్కడి స్థానికులతో పాటు అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది
ఇదిలా ఉంటే అసలు ప్లాంటులో వైరస్ ఎలా వ్యాపించిందనే విషయమై ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీనిపై ఎన్ఆర్‌డబ్ల్యూ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలిశాయి. అవేమంటే.. ప్లాంట్‌లో వందలాది మంది విదేశీయులు పనిచేస్తున్నారు. వారంతా ఇటీవల ప్రయాణాలు చేసినట్లు పరిశ్రమ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్ గేరోన్ షెహుల్జే అల్తాఫ్ తెలిపారు. ఈ ప్లాంట్ లో వైరస్ విజృంభించడంతో జర్మనీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
జర్మనీలోని కబేళాల్లో దాదాపు 2 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మూడొంతుల మంది విదేశీయులే ఉన్నారు. ఈ ప్లాంట్ లో వైరస్ ప్రబలడంతో జర్మనీ ప్రభుత్వం మేల్కొంది. కబేళాల్లో పనిచేసే కార్మికుల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు ప్రకటించింది.
గత నెల ఇదే రాష్ట్రంలోని కోస్‌ఫెల్డ్ జిల్లాకి చెందిన మరో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో 200 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఐరోపాలోని అన్ని దేశాలూ వైరస్ తో తీవ్రంగా సతమతమవుతుండగా జర్మనీ మాత్రం కొద్దిగా సరైన చర్యలు తీసుకుని కొంత అదుపులోకి తెచ్చింది.