కరోనా పాజిటివ్ కేసుల నమోదుకు సంబంధించి స్పీడ్ అంతకంతకూ పెరుగుతోంది. మార్చి మొదటి వారాన్ని చూస్తే.. ఒక కేసుకు ఒక కేసుకు మధ్య గ్యాప్ నాలుగైదు రోజులకు పైనే ఉండటాన్ని మర్చిపోలేం. అందుకు భిన్నంగా గడిచిన పదిహేను రోజుల్లో పరిస్థితి మారింది. ఇదిలా ఉంటే.. గడిచిన రెండు..మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోవటమే కాదు.. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
రికార్డు స్థాయిలో శుక్రవారం ఒక్కరోజులోనే తెలంగాణలో 75 పాజిటివ్ కేసులు కన్ఫర్మ్ కాగా.. అందులో సగం ఒక్క హైదరాబాద్ నగరంలోనివే కావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శుక్రవారం పాజిటివ్ కేసుల్లో వేళ్ల మీద లెక్కించే కేసులు మినహాయిస్తే.. మిగిలిన కేసులన్ని మర్కజ్ నేపథ్యంలోనివే కావటం మర్చిపోకూడదు.
గతానికి భిన్నంగా ఒక్కరోజులో 75 కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. రానున్న రెండు రోజుల్లో (శని.. ఆదివారాలు) పరిస్థితి ఎలా ఉండనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు రంగాల నిపుణులతో మాట్లాడినప్పుడు వారు చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరిని గుర్తించారు. అయితే.. వారిలో ఎక్కువమందికి పరీక్షలు నిర్వహించలేదు. కొద్దిమందికే నిర్వహించారు.
మర్కజ్ కు వెళ్లిన అందరికి శుక్ర.. శనివారాల్లో పరీక్షల ప్రక్రియ ముగుస్తుందని తెలుస్తోంది. దీంతో.. కేసుల తీవ్రత శని..ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి పరీక్షలు పూర్తి అయిన వెంటనే.. వారిలో పాజిటివ్ గా తేలిన వారికి కాంటాక్టు మీద ప్రభుత్వం ఫోకస్ చేయనుంది.
వాస్తవానికి.. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని చెబుతున్నారు. కాకుంటే.. గుర్తించిన వారందరికి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేని నేపథ్యంలో.. అనుమానాస్పదంగా ఉన్న వారికి తొలుత నిర్వహించి.. మిగిలిన వారికి దశల వారీగా టెస్టులు చేస్తున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల వెల్లడి కాస్త ఆలస్యమవుతుందన్న మాట వినిపిస్తోంది. పెద్ద ఎత్తున పరీక్షలు శని..ఆదివారాల్లో నిర్వహించటం కారణంగా.. శుక్రవారం వెల్లడైన పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగానే శని.. ఆదివారం కేసులు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. దానికి తగ్గట్లే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని చెబుతన్నారు.