మ‌నకు తెలివిలేద‌ని డైరెక్ట్‌ గా చెప్పేశారు

Update: 2015-12-16 17:30 GMT
మాన‌వ జీవితం దిన‌దినాభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త కొత్త అంచనాలు, కొత్త కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చిప‌డుతున్నాయి. అభివృద్ధి ఎంత జ‌రుగుతుందో....అవగాహ‌న లేనిత‌నం కూడా అంతే పెరుగుతోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మన దేశంలోని  ఓ ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిస్థితి గురించి వెలువ‌రించిన నివేదిక నివ్వెర‌ప‌రిచే నిజాలు తెలిపింది.

'స్టాండర్డ్స్‌ అండ్‌ పూర్‌' సంస్థకు దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు అంశాల‌పై ముఖ్యంగా ఆర్థిక విష‌యాల్లో విశేష‌మైన పేరు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ‌ ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో 'ఆర్థిక అక్షరాస్యులు' అనే అంశంపై లక్షా యాభై వేల వయోజనులను సర్వే చేసి నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ సగటు 66 శాతంతో పోలిస్తే భారత్‌లో ఆర్థిక నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువే అని తేలింది. 76 శాతం మంది వయోజనులకు ఆర్థిక సంబంధమైన  ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు, ఆర్థిక మందం వంటి విషయాల్లో అసలు అవగాహనే లేదని నివేదికలో తేలింది. ఆసియాలో అత్యధిక ఆర్థిక అక్షరాస్యులున్న దేశంగా సింగపూర్‌(5 నిలిచింది. హాంగ్‌ కాంగ్‌ - జపాన్‌ లు 43 శాతంతో తరువాత స్థానాల్లో నిలిచాయి. చైనాలో 28 శాతం మంది ఉన్నారు. స్త్రీలతో పోలిస్తే పురుషులు ఈ విషయంలో ఐదు శాతం ఎక్కువగానే ఉన్నారు. అన్ని దేశాల్లోనూ ఈ భేదం కొనసాగింది. భారత్‌ లో 73 శాతం పురుషులు, 80 శాతం స్త్రీలు ఆర్థిక నిరక్షరాస్యులుగా తేలారు.

ఇంతేకాదు వినియోగదారుల సౌకర్యాల వాడకంపైనా సర్వే జరిగింది. ఆర్థిక ఉత్పత్తులు విరివిరిగా పెరుగతున్న ఆసియాలో చాలా మందికి అప్పు(క్రెడిట్‌) - చక్రవడ్డీ) వంటి ముఖ్యమైన అంశాలపైనా కనీస అవగాహన లేదని తేల్చారు. దీని వల్ల తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారు. అప్పు కంటే పొదుపు వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. భారతీయ సంస్థల్లో పొదుపు చేస్తున్న 14 శాతం మంది తమ పొదుపుకు తగిన లాభాన్ని పొందుతున్నామా అని తరచూ సంశయిస్తుంటారని వెల్లడించింది. యుకె - యుఎస్‌ లతో పోలిస్తే ఆసియన్లు ఈ విషయంలో కాస్త ముందంజలోనే ఉన్నారు. ఆర్థిక తాహతూ దీనిపై ప్రభావం చూపించింది.
Tags:    

Similar News