ఏపీలో కరోనా అప్డేట్ : కొత్తగా 9,393 కేసులు .. 95 మరణాలు !

Update: 2020-08-20 14:30 GMT
ఆంధ్రప్రదేశ్ ‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోమరో 9,393 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,396కి చేరింది. కరోనాను జయించి 2,35,218 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 3001 మంది మరణించారు. ప్రస్తుతం 87,177 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అలాగే కరోనా తో మరో 95 మంది మరణించారు. చిత్తూరులో 16 మంది, నెల్లూరులో 9 మంది, అనంతపూర్ ‌లో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో 11 మంది , శ్రీకాకుళంలో 5 మంది , తూర్పుగోదావరిలో 8మంది , విశాఖపట్టణంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో 8 మంది , కడపలో 7 మంది , కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఆరుగురు చనిపోయారు.ఇక టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 55,551 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 20241 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,74,847 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 973 , చిత్తూరులో 836 , తూర్పు గోదావరిలో 1357 , గుంటూరులో 443, కడపలో 434, కృష్ణాలో 195, కర్నూలులో 805 , నెల్లూరులో 588, ప్రకాశంలో 635, శ్రీకాకుళంలో 762, విశాఖలో 985 , విజయనగరంలో 385, పశ్చిమ గోదావరిలో 995 కేసులు నమోదయ్యాయి.




Tags:    

Similar News