చదువు కోవడం లేదు..! నువ్వెందుకు పనికిరావంటూ ఓ కుర్రాడని 17 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటేశారు. కానీ ఆ కుర్రాడు ఇప్పుడు ఓ బిలియనీర్ అయ్యాడు. ఓ స్టార్టప్ స్థాపించి ప్రపంచమే గర్వించేలా ఎదిగాడు. ఇప్పుడా యువకుడి కంపెనీ విలువ అక్షరాల 1 బిలియన్ డాలర్లు. ఆ యువకుడే తైహి కోబయాషి.. తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటేస్తే.. టోక్యో నగరవిధుల్లో పిచ్చోడిలా తిరిగిన ఆ కుర్రాడు ఈ రోజు కోట్ల రూపాయలకు పడగెత్తాడు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న కోబయాషి జీవితంలోని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కోబయాషికి మ్యూజిక్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి స్కూల్ ఎగ్గొట్టి తరుచూ మ్యూజిక్ నేర్చుకొనేందుకు వెళ్లేవాడు.
అతడు చదువులో ఏనాడు రాణించలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా కోబయాషి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తల్లిదండ్రులు అతడిని 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కోబయాషికి కష్టాలు మొదలయ్యాయి. గడ్డ కట్టే చలిలో టోక్యో విధుల్లో పడుకొనేవాడు. చలికి వణకడం, వానకు తడవడం అలవాటుగా మారిపోయాయి. ఇటువంటి ఘటనలే అతడిలో కసిని పెంచాయి. ఎలాగైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పట్టుదలతో నిర్ణయించుకున్నాడు. అయితే అతడిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించిన ఓ లైవ్‌మ్యూజిక్ సంస్థ కోబయాషిని ఆదరించింది. అతడికి ఉద్యోగం ఇచ్చింది.
కానీ కోబయాషి టార్గెట్ అది కాదు. అయితే చివరకు 2012లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కోబయాషికి ఉద్యోగం వచ్చింది. అతడికి ఎటువంటి అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినప్పటికీ మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఐక్యూ టెస్ట్ నిర్వహించి అతడికి ఆ సంస్థ ఉద్యోగం ఇచ్చింది. అయితే కోబయాషికి అక్కడ కొందరు మిత్రులు పరిచయమయ్యారు. వారి సాయంతో 2013 మార్చిలో ఫ్రామ్గియా ఇన్‌కార్పొరేషన్ పేరిట స్టార్టప్ స్థాపించారు. తర్వాత దాని పేరును సన్ అస్టెరిస్క్‌గా మార్చారు. స్టార్టప్‌లకు ఐడియాలు ఇవ్వడం, కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు తన కంపెనీ సలహాలు ఇస్తూ ఉంటుంది.
అయితే కొద్ది రోజుల్లోనే ఈ కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయింది. కోబయాషి కంపెనీకి క్లయింట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో అనతి కాలంలోనే కోబయాషి ఎంతో ఎత్తుకు ఎదిగారు. అయితే అతడు ఇప్పటివరకు తన తల్లిదండ్రులను మాత్రం కలుసుకోలేకపోయాడు.