ఘోరం: తోటలో విగతజీవులుగా కిడ్నాప్ చేసిన ఎన్నారై కుటుంబం

Update: 2022-10-06 07:44 GMT
కాలిఫోర్నియాలో బుధవారం కిడ్నాప్ అయిన ఎన్నారై కుటుంబం దారుణ హత్యకు గురైంది.  ఈ ఘటనలో 8 నెలల పాప సహా నలుగురు భారతీయ సంతతికి చెందిన కుటుంబం మృతిచెందింది. బాధితులను 8 నెలల అరూహి ధేరి,  27 ఏళ్ల  జస్లీన్ కౌర్, ఆమె భర్త 36 ఏళ్ల జస్దీప్ సింగ్.. ఆమె 39 ఏళ్ల మేనమామ అమన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.

పంజాబ్‌లోని హర్సీ పిండ్‌కు చెందిన సిక్కు కుటుంబం  వీరిది. వీరు సెంట్రల్ కాలిఫోర్నియాలోని మోడెస్టో మరియు ఫ్రెస్నో మధ్య ట్రక్కింగ్ వ్యాపారం చేస్తున్నారు. వీరు ట్రక్కింగ్ వ్యాపారం నిమిత్తం కార్యాలయానికి వెళ్లగా అక్కడ కిడ్నాప్ చేయబడ్డారు.. కిడ్నాప్ చేసిన తర్వాత తుపాకీతో బెదిరించి వీరిని ఎక్కడికో దుండగుడు తీసుకెళ్లాడు.  అధికారులు ఎంత వెతికినా వీరి ఆచూకీ మాత్రం కనిపించలేదు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరికి చెందిన వాహనం అగ్నికి ఆహుతైంది. సోమవారం. మెర్సిడ్ కౌంటీలోని అట్‌వాటర్‌లోని ఏటీఎంలో కిడ్నాప్ అయిన బాధితుడి బ్యాంక్ డెబిట్ కార్డు ఒకటి ఉపయోగించినట్లు మంగళవారం ఉదయం పోలీసులు సమాచారం అందుకున్నారు.

కిడ్నాపర్‌  టచ్‌లోకి రాలేదని, అందువల్ల అతను కిడ్నాపర్లను విడుదల చేయడానికి ఎలాంటి  డిమాండ్ చేయలేదని పోలీసులు ధృవీకరించారు. ఇది ఆర్థిక ప్రేరేపిత నేరంగా పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ చూస్తే.. సిక్కు కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది.. వీరికి తెలిసిన వ్యక్తిగానే అనుమానిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. 48 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు.. అనుమానితుడిని జీసస్ మాన్యువల్ సల్గాడోగా గుర్తించారు. అతను సిక్కు కుటుంబాన్ని చంపిన తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. వైద్య చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది.

ఎనిమిది నెలల పసికందును సైతం వదలకుండా దారుణంగా హత్య చేయడంతో బాధితుల సోదరుడు సుఖ్‌దీప్ సింగ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్ -కిర్పాల్ కౌర్ సెప్టెంబర్ 29న విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. కిడ్నాప్‌కు సంబంధించి కాల్ వచ్చినప్పుడు రణధీర్ రిషికేశ్‌లో ఉన్నాడు.

అమెరికాలో ముఖ్యంగా భారతీయులపై నేరాలు పెరుగుతున్నాయి. జాత్యాహంకార దాడులు సాగుతున్నాయి. తాజాగా కిడ్నాప్ హత్యతో మరోసారి ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. భారతీయులంతా ఈ హత్యతో ఆందోళన చెందుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News