ఉద్యోగం కోసం 30 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం

Update: 2021-11-27 06:23 GMT
భారత దేశ న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ఆ వ్యక్తిని సుదీర్ఘ పోరాటం చేసేలా ప్రేరేపించింది. తనకు జరిగిన అన్యాయంపై అంచలంచలుగా ఒక్కొక్క న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేస్తూ చివరకు విజయం సాధించారు. ఇదంతా జరిగింది కేవలం ఒకే ఒక్క లెక్చరర్ ఉద్యోగం కోసం. అయితే ఈ ఉద్యోగం కోసం అతను ఖర్చు చేసినా సమయం 30 ఏళ్ల పైనే.

ఇంత సుదీర్ఘ పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? అంటే కచ్చితంగా ఉందని అంటున్నారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కి చెందిన జాన్ జరాల్డ్. స్థానికంగా ఉండే చర్చ్ ఆఫ్ ఇండియా ఇంటర్మీడిట్ కళాశాలలో తాను మొదటగా ఉద్యోగానికి సెలక్ట్ అయ్యారు. ఆ ఎంపికలో అతనే మొదటి స్థానం సంపాదించారు. అయితే నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు గా అతనికి షార్ట్ హ్యాండ్ రాదనే కారణంతో జాబితాలో అతను తర్వాత ఉన్నా వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని కట్టబెట్టింది యాజమాన్యం.

ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఆయన... కోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. అంతిమంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కాలంలో అతను మరే వృత్తినీ స్వీకరించలేదు. ట్యూషన్ చెబుతూనే కాలం వెళ్లదీశారు. చివరకు పెళ్లి కూడా చేసుకోలేదు.

24 ఏళ్ల వయసున్నప్పుడు జాన్ ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అప్పటి నుంచి సుమారు 30 ఏళ్లపాటు తన న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఇప్పుడు జాన్ కు సరిగ్గా 55 ఏళ్ల వయసు ఉంటుంది. జాన్ ను చర్చ్ ఆఫ్ ఇండియా కళాశాలలో ఉద్యోగం కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై స్పందించిన జాన్ తనకు ఎవరిమీద కోపం అసహనం లాంటివి లేవని చెప్పుకొచ్చారు. ఈ న్యాయ పోరాటం అంతా కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే చేసిందని అన్నారు.

నిన్నటిదాకా ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ ఇండియా కళాశాల ప్రిన్సిపాల్ పదవీ విరమణ చేయడం కారణంగా ప్రస్తుతం ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే 20 సంవత్సరాల కాలానికి సరిపడా డబ్బులు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉత్తరాఖండ్ ప్రభుత్వం అతనికి అప్పజెప్పింది.

దీనితో పాటు సర్వీసును కొనసాగించడం పై కూడా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన పదేళ్ల కాలానికి సరిపడా డబ్బు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఈ రెండూ ప్రభుత్వాల నుంచి రావాల్సిన మొత్తం ఇంకా తనకు అందలేదని జాన్ చెప్పుకొచ్చారు.

తాను చేసిన సుదీర్ఘ పోరాటం పై సహచర మిత్రులు అతనికి అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అని జాన్ సహచరులు అంటున్నారు. అంతేకాకుండా న్యాయం జరుగుతుందో లేదో అని తెలియకుండా పోరాటం కొనసాగించడం అనేది చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఒంటరిగా పోరాడినట్లు వారు గుర్తు చేశారు

జాన్ చేసిన పోరాటం కేవలం ప్రభుత్వం మీదే కాదు నిజానికి అది ఒక వ్యవస్థ మీద చేసిన యుద్ధం. కేవలం ఒకే ఒక మనిషి ఒంటరిగా ఎవరి మీదా ఆధారపడకుండా అన్యాయాన్ని నమ్ముకుని నెలల కాలం రాయడమనేది అసహజం కానీ జాన్ చేసిన ఈ న్యాయ పోరాటం చరిత్రలో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News