విజయవాడ.. ఆదివారం రాత్రి.. ముఖ్య నాయకులతో జనసేనాని పవన్ కళ్యాణ్ అంతర్గత చర్చ.. కీలక విషయం ఏంటంటే.. పవన్ కాన్వాయ్ ను టార్గెట్ చేసుకొని వరుసగా ఢీకొడుతున్న ఇసుక లారీల వెనుక ఎవరున్నారు.? ఇది యాధృశ్చికంగా జరుగుతోందా.? లేక కావాలనే చేయిస్తున్నారా.? ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగిన వేళ.. ప్రతిపక్ష నేతల భద్రతకు తూట్లు పొడిచే ఇలాంటి చర్యలపై పవన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
జగన్ పైన హత్యాయత్నం జరగడం.. ఆ కేసులో నిజాలు కూడా బయటకు రాని పరిస్థితి లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో ఏపీలోని ప్రతిపక్ష నేతల్లో భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి. తాజాగా విజయవాడలో జరిగిన అంతర్గత జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం తనకు కేటాయించిన గన్ మెన్లపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని ఇటీవలే పవన్ వెనక్కి పంపించేసిన సంగతి తెలిసిందే..
తాజాగా వరుసగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ టార్గెట్ గా ఇసుక లారీలు ఢీకొనడంపై విజయవాడ మీటింగ్ లో పవన్ ప్రస్తావించినట్టు తెలిసింది. ఈనెల 15న కాకినాడ నుంచి రాజానగరం కు వస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ కు తోడుగా వస్తున్న బౌన్సర్లు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పవన్ కారుకు ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అదే రోజు రాత్రి నాదేండ్ల - పవన్ కలిసి హైదరాబాద్ వెళ్లారు. శంషాబాద్ నుంచి ఇంటికి వెళుతుండగా నాదేండ్ల కారును ఇసుక లారీ ఢీకొట్టింది. మనోహర్ కారు దెబ్బతిని ఆయన ప్రాణాలతో లక్కీగా బయటపడ్డారు.
ఈ రెండు ఘటనలను ప్రస్తావించిన పవన్ తనపై దాడికి జరుగుతున్న కుట్రగా దీన్ని నాయకుల వద్ద అభివర్ణించారట.. ఇసుక లారీలే తన కాన్వాయ్ ను ఢీకొట్టడం వెనుక ఎవరున్నారనే విషయంపై లోతుగా చర్చించారట. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. పవన్ ను వెంటాడుతున్న ఈ ఇసుక లారీల గుట్టు ఇప్పుడు జనసేనానికి అంతుచిక్కని వ్యవహారంగా మారింది.