ఒక్కసారి వైరస్ సోకితేనే కోలుకోవడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తి వైరస్ బారినపడి విజయవంతంగా ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లాడు. అయితే అలా వెళ్లిన కొన్నాళ్లకే మళ్లీ వైరస్ సోకడం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ఏకంగా రెండుసార్లు కరోనా సోకింది. దీంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చోటుచేసుకుంది.
విశాఖపట్టణంలోని ఓ కుటుంబం కరోనా వైరస్ బారిన పడింది. ఆ ఇంట్లో 8 మంది ఉండగా వారందిరికీ పాజిటివ్ వచ్చింది. ఆ ఇంట్లోని 30 ఏళ్ల వ్యక్తి ముంబై నుంచి వచ్చాడు. అతడికి ఏప్రిల్ 1వ తేదీన పాజిటివ్ తేలింది. ఆ తర్వాత రెండు రోజుల్లో అతడి భార్య, 18 నెలల చిన్నారికి తప్ప ఇంట్లోని వారందరికీ వైరస్ వ్యాపించింది. వారని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. అయితే ఐదు రోజులు తిరక్కుండానే తల్లికి పాజిటివ్ వచ్చింది. కొద్ది రోజులకు ఆమె కోలుకుంది. ఆతర్వాత ఆ వ్యక్తికి మళ్లీ వైరస్ సోకింది. అతడితో పాటు బాలుడికి కూడా వ్యాపించింది. ఆ తండ్రికి వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించగా మిగిలినవారిని క్వారంటైన్‌కు తరలించారు.