విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక నోవాటెల్ దగ్గర కారుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కాగా రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలోనే ఈ దారుణం చోటుచేసుకుందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్ రెడ్డి అనే నలుగురు కారులో కూర్చొని ల్యాండ్ విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాగ్వాదం తలెత్తింది.
వేణుగోపాల్ రెడ్డి చర్చల మధ్యలోనే కారు నుంచి దిగిపోయాడు. వెంటనే డోర్లు అన్నీ లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. విచారణ జరుపుతున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.