ఇంట్లోనే హిమాలయన్ వయాగ్రా పండించి లక్షాధికారైన రైతు

Update: 2022-08-03 23:30 GMT
హిమలయాలంటేనే ఎన్నో ప్రకృతిసిద్ధ మనమూలికలకు ప్రసిద్ధి. మన హనుమాన్ ఇక్కడే సంజీవనిని కనిపెట్టి లక్ష్మణుడికి ప్రాణధానం చేశాడని పురాణాల్లో ఉంది. అత్యంత అరుదైన విలువైన మొక్కలు,చెట్లకు ఈ హిమాలయాలు ఆవాసం.. అందులో ‘కీడా జడి’ కూడా  అడవిజాతికి చెందిన ఒక పుట్టగొడుగు మొక్క. దీన్నే హిమాలయన్ వయాగ్రా అంటారు.

హిమాలయన్ వయాగ్రా.. దీన్నే ‘కార్డిసెప్స్ సైనెన్సిస్’ మూలికగా చెబుతుంటారు. హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3600 నుంచి 5వేల మీటర్ల ఎత్తులో వెరీ రేర్ గా ఈ మొక్క పండుతుంది. చూడడానికి ఎండు మిరపకాయల్లా ఉంటాయి.. కానీ దగ్గరి నుంచి చూస్తే ఇవీ గొంగళి పురుగులు ఆకారంలో ఉంటాయి. వీటికి అద్వితీయమైన శక్తి ఉంది. ఈ హిమాలయాల్లో దొరికే అరుదైన మొక్కలకు మొండి రోగాలు నయం చేసే శక్తి ఉంది. వీటిని కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి.. అంత ఖరీదు మరీ..

ఈ మొక్కలు కేవలం హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతాయి. అందుకే వీటిని హిమాలయన్ వయాగ్రా అంటారు. సముద్రమట్టానికి 3వేల నుంచి 5వేల మీటర్ల ఎత్తులో మాత్రమే జీవించే ‘కీడా జాడీ’ అనే మొక్క ఫంగస్ కు గురై భూమిలోకి కూరుకుపోతాయి. అవి క్రమేణా ఎండిపోతాయి. వీటిని టిబెట్ లో ‘యర్సగుంబ’ అని పిలుస్తారు. వీటిని సేకరించడమంటే ప్రాణాలకు తెగించి హిమాలయాల్లో పర్వతాలపైకి ఎక్కి అన్వేషించాలి.

ఈ అరుదైన మొక్కను ఇంట్లోనే ఓ ల్యాబ్ ఏర్పాటు చేసి పెంచాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కుల్లూకు చెందిన ఓ రైతు. అతడి పేరు గౌరవ్ శర్మ. ఇప్పుడు ఈ రైతు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారాడు. వివిధ రకాల మెడిసిన్స్ లో ఈ మూలిక మొక్కను విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా సెక్యువల్ కెపాసిటీ పెంచే నేచురల్ స్టెరాయిడ్ గా ఇది పనిచేస్తుందని చెబుతారు.

చైనా సహా ఫారెన్ కంట్రీస్ లో కీడా జడీకి విపరీతమైన డిమాండ్ ఉంది. విదేశాల్లో కేజీ ధర 30 నుంచి 35 లక్షల వరకూ ఉంటుంది. దీని ప్రాముఖ్యత తెలియకపోవడంతో దేశీయంగా రూ.3-5 లక్షలు మధ్యే ధర పలుకుతుంది.
మలేషియాలో ఉండే ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు గౌరవ్ శర్మ తన ఇంట్లోనే ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. మొక్కలపై అధ్యయనం చేసి మరీ పెంచాడు.

తాజాగా 45 రోజుల్లోనే హిమాలయన్ వయాగ్రా  పంటను పండించాడు. మొదటి దశలో ఏకంగా 3వేల బాక్సుల పంటను బెంగళూరులోని ఓ కంపెనీకి అమ్ముతున్నట్టు తెలిపారు. లక్షల విలువ చేసే ఈ పంటను అమ్ముతూ ఆ రైతు లక్షాధికారిగా మారాడు.
Tags:    

Similar News