సెంట్రల్‌ విస్టా : ఆ 404 చెట్లకి బదులు 4040 మొక్కలు నాటాల్సిందే !

Update: 2021-11-12 02:30 GMT
ప్రధాని మోదీ పార్లమెంట్‌ కొత్త భవనం సెంట్రల్‌ విస్టాకు 2020 డిసెంబర్ 10 న శంకుస్థాపన చేశారు. ఈ భవనం భూమిపూజలో ప్రధాని మోదీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. పురివిప్పిన నెమలిలా, విరబూసిన కమలంలా ఈ భవనం కనిపించబోతోంది. అణువణువులో భారతీయత ఉట్టిపడేలా నిర్మించబోతున్నారు. కొత్త పార్లమెంటును నిశితంగా పరిశీలిస్తే.. జాతీయ పక్షి నెమలి, జాతీయ పువ్వు కమలం కనిపిస్తాయి. ఇక జాతీయ వృక్షమైన మర్రి చెట్టు కూడా పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలిలా కనిపించనుంది. రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది.

64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేయగా అది మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 2022 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఓ నిర్మాణం జరిగే సమయంలో ఆ ప్రదేశం లో ఉండే చెట్లను తొలగించటం సర్వసాధారణం. అలాగే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం సదర్భంగా ఆ ప్రాంతంలో ఉండే చెట్లను తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చెట్లను తొలగించారు. అలా ఇప్పటికే 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా అక్కడి నుండి తొలగించిన 404 చెట్లకు బదులుగా 4040 మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారి చేసింది. అలాగే నాటిన మొక్కల్ని పరిరక్షించాలని, కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవన ప్రాంగణంలో ఉన్న 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నందునందుకు పరిహారంగా ఆ ప్రాంతంలో కొత్తగా 4,040 మొక్కలు నాటి పెంచాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మొక్కల నిర్వహణకు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌ మెంట్‌ ముందస్తుగా రూ.2.30 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే నాటిన మొక్కల్ని నాటబోయే మొక్కలను ఏడు సంవత్సరాల పాటు పీడబ్ల్యూడీ డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తూ సంరక్షించాలని ప్రకటించింది. తరలించిన 404 చెట్లలో ప్రతి చెట్టుకు 10 చొప్పున 6-8 అడుగులమేర ఎత్తున్న మొక్కలను నాటాలని, ఆ మొక్కలు నాటేందుకు కేటాయించిన భూమిని మరే అవసరాలకూ వాడకూడదని సుస్పష్టం చేసింది. నాటిన మొక్కల్లో ఏ ఒక్క మొక్క చనిపోయనా ఆ స్థానంలో మరో మొక్కను నాటాలని వాటిని సంరక్షిచాలని తేల్చి చెప్పింది. అంతేకాదు అలా చనిపోయిన మొక్కల లోటును భర్తీలా 500 మొక్కలు అదనంగా నాటాలని తెలిపింది.


Tags:    

Similar News