ఆయనే సీఎం.. అధికారపార్టీని షేక్ చేస్తున్న పోస్టర్

Update: 2020-08-15 17:30 GMT
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో పోస్టర్లు కలకలం రేపాయి. ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్లు అధికార పార్టీలో కలకలాన్ని సృష్టించాయి.

కొంతమంది సీనియర్ మంత్రులు.. సీఎం ఫళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇళ్లవద్దకు క్యూలు కట్టారు.

ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సీఎం ఫళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోకుండా కార్యకర్తలందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇలా పోస్టర్లు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తమిళనాడులో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయి. దీంతో ఇప్పటినుంచే ఆ పార్టీలో సీఎం రేసు మొదలైంది.
Tags:    

Similar News