ఓ విధంగా ఇది ఆశ్చర్యకరం కానీ నిజం. ఎందుకంటే ఇప్పుడు జగన్ పూర్తిగా మారిపోయారు అని అంటున్నారు. తన ఇంటికి సొంత బంధువులను కూడా రానివ్వడం లేదట. ఆయన ఎందుకిలా స్ట్రిక్ట్ అయిపోయారో మరి! మరి జగన్ కి సమాచారం మోసే నమ్మకస్తులే లేరా అంటే... ఉన్నారు... జగన్ కు దగ్గరి ఆత్మ బంధువులు ఇద్దరే ఇద్దరు అని అంటున్నారు. మంత్రులకూ ఆ ఇంట్లో నో ఛాన్స్ అని కూడా తెలుస్తోంది. దగ్గరి బంధువులకూ,దూరపు చుట్టాలకు ఆఖరికి మరో మామ శ్రీనివాస్ బాలినేనికి కూడా ఆ ఇంటి (సీఎం ఇంటి) బాల్కనీలో చోటు లేదని తెలుస్తోంది. ఏమయింది ఎందుకని ఆ ఇద్దరే ! ఎవరా ఇద్దరు?
అంటే గత ఎన్నికల్లో అన్నింటినీ చూసుకున్నది వాళ్లే కనుక మంత్రులలో ఆయన పెద్దగా ఎ వ్వరినీ విశ్వసనీయతలోకి తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. అసలు పాత మంత్రివర్గంలోనూ ఆయనకు పె ద్దగా సన్నిహితంగా ఉన్నవారు లేరు అని కూడా ఓ రూమర్ ఉంది. బయటకు మాట్లాడిన వారంతా కేవలం సీఎంఓ వరకే ! అని, అదే ట్రెండు ఇప్పుడు కూడా ! ఉందని సమాచారం. ఏదేమయినా ఆఫీసు వివరం ఆఫీసు వరకే ! ఇంటి గుట్టు మాత్రం ఆ ఇద్దరికే ఎరుక ! అని పార్టీ వర్గాలు గుసగుల లాడుకుంటున్నాయి. వారే పెద్దిరెడ్డి. సాయిరెడ్డి.
ఆంధ్రావని రాజకీయాల్లో భలే మార్పులు వస్తున్నాయి. సీఎం ఇల్లు, సీఎంఓ పక్కపక్కనే ఉన్నా కూడా జగన్ ఇంటికి వెళ్లే ఛాన్స్ ఇద్దరికే ఉందని తెలుస్తోంది. వారిలో ఒకరు పెద్దాయన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కాగా, మరో పెద్దాయన, ఇటీవలే రెండోసారి రాజ్యసభకు ఎన్నికయిన సాయిరెడ్డి. వీళ్లద్దరికే అక్కడ ఎంట్రీ ఉందని, వాళ్లిద్దరే జగన్ తో ఆంతరంగికంగా మాట్లాడి వస్తున్నారని ఏపీ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తోంది. మిగతా వాళ్లంతా సీఎంఓకే పరిమితం కావాలి అని., అత్యంత సన్నిహితులకు కూడా జగన్ ఇంటికిపోయి నేరుగా మాట్లాడి వచ్చే అవకాశాలే లేకుండా ఉన్నాయి అని అంటున్నారు కొందరు. ఇటీవల కాలంలో విజయమ్మ రావడం మానేశారు అని తెలుస్తోంది. ప్లీనరీ వేళ అయినా ఓ సారి కనిపించి వెళ్తారో లేదో అన్న సందేహాలూ ముసురుకున్నాయి. అయితే ఎన్నికల ముందు కనుక కొడుకు రాజకీయ వృద్ధి కోసం మళ్లీ విజయమ్మ ఇటుగా రావొచ్చు అన్న సమాచారం కూడా ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. ఇవన్నీ ఊహాగానాలే కనుక ఏవి ఎలా ఎప్పుడు మారిపోతాయి చెప్పలేం.
ఇక జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ప్రభుత్వ సలహాదారుకు కూడా ఆ ఇంట్లో ఎంట్రీ లేదు అని సమాచారం. అదేవిధంగా ఒకప్పటి కడప మేయర్, ఇప్పటి ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి (వరుసకు మామ, అమ్మ తరఫు బంధువు) కూడా సీఎం ఇంట్లో ఎంట్రీ లేదు అని కొందరు అంటున్నారు.ఆయన కూడా సీఎంఓకే పరిమితం అవుతున్నారని పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాట. వచ్చే ఎన్నికల్లో కూడా సాయిరెడ్డే కీలకం అని తెలుస్తోంది.