ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సునామీ వచ్చినట్టు అయింది. శుక్రవారం అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా.. కత్తులు దూసుకున్నాయి. ఏకంగా.. అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇటు.. ప్రతి పక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. నిన్న మొన్నటి వరకు లేని కామెంట్లు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిపోయింది. చంద్రబాబు కోసం.. పవన్ కాపులను అమ్మేస్తున్నాడంటూ.. జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఎన్నికల్లో ఫ్యాన్‌ను నిలిపివేయాలంటూ.. చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే.. సాధారణంగా.. చేసుకునే వ్యాఖ్యలకు ఇవి భిన్నంగా ఉండడం.,. ఒకే సారి.. ఒకే రోజు నేతల నోటి నుంచి ఎన్నికల ప్రస్తావన రావడం.. గమనార్హం. ``మీకు ఎవరు కావాలో తేల్చుకునే సమయం వచ్చింది.
ప్రజాధనం తినే వాళ్లు కావాలో.. ప్రజాధనాన్ని ప్రజలకు పంచేవాళ్లు కావాలో.. తేల్చుకోండి.`` అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునివ్వడాన్ని బట్టి.. ఇది ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు సన్నాహకంగానే భావించాల్సి ఉంటుందని.. పరిశీలకులు.
మరోవైపు.. చంద్రబాబు కూడా.. ఫక్తు ఎన్నికల సమయంలో మాట్లాడిన విధంగానే మాట్లాడారు. తాజాగా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన.. చంద్రబాబు.. ప్రజలు తమకు జరుగుతున్న నష్టాలను, కష్టాలను గుర్తు పెట్టుకుని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏవిధంగా అయితే.. ఫ్యాన్ ఆగిపోయిందో.. అలానే.. ఎన్నికల్లో ఫ్యాన్ తిరగకుండా చేయాలని.. పిలుపునిచ్చారు. సాధారణంగా.. ఎక్కడ మాట్లాడినా.. ఇంత వాడి వేడి వ్యాఖ్యలు.. ఈ ఇద్దరు నేతలు చేసిన సందర్భాలు కనిపించవు., కానీ, శుక్రవారం.. ఇద్దరి నోటి నుంచి కూడా ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం.
అంతేకాదు.. అటు జగన్, ఇటు చంద్రబాబు కూడా.. ప్రజల తో మాట్లాడిన ప్రతి మాట కూడా.. ఎన్నికలను తలపించేలా కనిపించింది. జగన్ మాట్లాడుతూ.. తన పాలనను.. చంద్రబాబు పాలనను పోల్చారు.
అదేసమయంలో చంద్రబాబు కూడా.. తన పాలనలో జీవో 9 తెచ్చి.. ఇలాంటి సమయాల్లో.. బాధితుకు విరివిగా నిధులు అందించేలా చేశామన్నారు. తన పాలనను జగన్ పాలనను పోల్చారు. మొత్తానికి ఈ ఇద్దరి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే.. ఏదో.. ముందస్తుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు వచ్చినట్టు కనిపిస్తోందని.. పరిశీలకులు అంటున్నారు.