చైనా నుండి వచ్చిన యువతి - విశాఖలో కరోనా వైరస్ కలకలం

Update: 2020-02-18 16:33 GMT
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కేసులు మన దేశంలో కేరళలో నమోదయ్యాయి. ఇప్పుడు విశాఖపట్నంలోను కరోనా కలకలం చెలరేగి - తెలుగు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేసింది. విశాఖలో ఓ యువతికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి చైనాలో మెడిసిన్ చదివేందుకు వెళ్లింది. ఇటీవలే బ్యాంకాంక్ మీదుగా వైజాగ్ చేరుకుంది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి - చికిత్స అందిస్తున్నారు.

బాధిత యువతి వయస్సు 18 ఏళ్లు. ఆమె 2019లో చైనాలో ఎంబీబీఎస్‌ లో చేరింది. ఐదు రోజుల క్రితం (ఫిబ్రవరి 13) ఆమె చైనా నుండి తన సొంతూరు విశాఖకు తిరిగి వచ్చింది. ఆమె చైనా నుండి రావడం - కరోనా లక్షణాల అనుమానంతో ఆసుపత్రిలో చేర్పించారు.

ఆమె చైనా నుండి బ్యాంకాంక్‌ కు వెళ్లింది. అక్కడి నుంచి కోల్‌కతాకు వచ్చి, అటు నుంచి ఫలక్‌ నుమా ఎక్స్‌ ప్రెస్ రైళ్లో వైజాగ్ వచ్చింది. కరోనా లక్షణాలు కొన్ని కలిగిన డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. వాంతులు - తలనొప్పి - గొంతు నొప్పి వంటివి వచ్చినట్లు తెలిపింది. దీంతో ఆమెను ఛాతి ఆసుపత్రిలో చేర్పించారు. చైనా నుండి వచ్చిన యువతి ఆసుపత్రిలో చేరారని, కానీ కరోనా కన్‌ఫర్మ్ కాలేదని, అనుమానాలు మాత్రమేనని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున అన్నారు.

ఆమె మెడికల్ శాంపిల్స్‌ ను తిరుపతిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. రిపోర్ట్‌ లో నెగిటివ్ వస్తే, అబ్జర్వేషన్ అనంతరం ఆమెను ఇంటికి పంపిస్తారు. కరోనా వైరస్ అనుమానం నేపథ్యంలో విశాఖ అలర్ట్ అయింది. చైనా, మలేషియా - సింగపూర్ నుండి వచ్చిన ప్రయాణీకులను ఎయిర్‌ పోర్ట్ అదికారులు పరీక్షిస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య 1,873కు చేరుకుంది. చైనాలోని జనాభాలో దాదాపు సగం మంది కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రయాణ ఆంక్షలు, ఇళ్ల నుండి బయటకు రాకపోవడం వంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు కరోనా వైరస్ పాకింది. వేలాదిమందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది.


Tags:    

Similar News