శానిటైజర్‌ ఓ మహిళ ప్రాణాల మీదకి తెచ్చింది..ఏమైందంటే?

Update: 2020-09-05 23:30 GMT
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పేస్ మాస్క్ , అలాగే చేతులకి శానిటైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. వైరస్‌ సోకకుండా ఉండేందుకు కొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకొన్నారు.  అయితే, కరోనా నుండి కాపాడుకోవడానికి వాడే శానిటైజర్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. అనుకోకుండా శానిటైజర్‌ బాటిల్‌ పేలిపోవడంతో, ఆమె శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్ ‌ చోటుచేసుకోగా .. కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .... టెక్సాస్‌ కు చెందిన కేట్‌ వైడ్‌ గత ఆదివారం, ప్రతిరోజు చేసిన విధంగానే , ఆ  రోజు కూడా చేతులకు శానిటైజర్‌ రాసుకుంది. ఆ తర్వాత కొవ్వొత్తి వెలిగిద్దామని అగ్గిపుల్ల గీసింది. అంతే ఆమె చేతికి మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడ్డ ఆమె వెంటనే వెనక్కు దూకింది. ఆ సమయంలో వెనకాల ఉన్న శానిటైజర్‌ బాటిల్ ‌ను తాకింది. ఆ వెంటనే మంటలు శానిటైజర్‌ బాటిల్‌ ను అంటుకోవటంతో బాంబ్‌ లాగా పెద్ద శబ్ధంతో పేలిందది. పెద్ద ఎత్తున ఎగిసి పడ్డ మంటలు ఆమెను చుట్టుముట్టడం తో ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న కేట్‌ కూతుళ్లు స్థానికుల సహాయంతో ఆమెను‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి .. శానిటైజర్ వాడే సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి.
Tags:    

Similar News