గ్రామ వలంటీరు.. పింఛన్ సొమ్ముతో పరార్

Update: 2020-07-02 12:10 GMT
ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడం గ్రామ వలంటీర్ల బాధ్యత. వృద్ధులు,వికలాంగులకు ప్రతీ నెల పింఛన్ అందివ్వడం వలంటీర్ల కర్తవ్యం. అయితే అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కొండంపల్లిలో బుధవారం ఓ వింత ఘటన చోటుచేసుకుంది.

కొండపల్లి గ్రామానికి చెందిన హనుమంతు నాయక్ గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా మాదిరే మంగళవారం సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి 49 పింఛన్లకు గాను రూ. 63500 నగదును తీసుకున్నారు.

అయితే ఉదయం గ్రామ వలంటీరు ఆ పింఛన్ సొమ్ముతో ఉడాయించాడు. పింఛన్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన పింఛన్ దారులు మధ్యాహ్నం అయినా రాకపోయేసరికి సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పంచాయితీ కార్యదర్శి, వేల్ఫేర్ ఆఫీసర్ విచారించి గ్రామ వలంటీర్ డబ్బులతో ఉడాయించాడని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ గ్రామ వలంటీర్ కు చెడు అలవాట్లు ఉన్నాయని.. పేకాట ఆడి తగలేస్తుంటాడని.. ఆ డబ్బులు కూడా అలానే పోగొట్టి ఉంటాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇలా ప్రజలకు సంక్షేమ డబ్బులు ఇవ్వాల్సిన వలంటీర్ల చేష్టలు పింఛన్లు పొందే వృద్ధులకు శాపంగా మారాయి. వలంటీర్ల వ్యవస్థలో ఇలాంటి సంఘటనలతో నమ్మకాన్ని సడలించేలా చేస్తున్నాయి.
Tags:    

Similar News