జైలుకు వెళ్లారు వైసీపీ ఎమ్మెల్సీ. ఆయన పేరు అనంతబాబు. ఆయన హత్య కేసులో ఇరుక్కుని జైలులో ఏకంగా 211 రోజులు గడిపారు. ఆయన జిల్లా కోర్టు నుంచి హై కోర్టు దాకా వెళ్లారు. అయినా బెయిల్ దక్కలేదు. సుప్రీం కోర్టు దాకా వెళ్లి మొత్తానికి బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఎదురేగి వచ్చారు అభిమాన జనం.
అనంతబాబుకు అనంతమైన జనాభిమానం అలా వెల్లువలా పొంగిపొరలింది. ఆయన తన డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లారు. సుప్రీం కోర్టులో పోలీసులు సరైన వాదన వినిపించకుండా వదిలేయడంతో బెయిల్ దక్కింది అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి అనంతబాబుకు అమితమైన ఆదరణ జైలు బయట లభించడం చూసిన వారు అంతా షాక్ తిన్నారు. అవాక్కు అయ్యారు.
ఆ మీదట అనుకున్నారు అనంతబాబుకు అంత ఉండాల్సిందే అని. విషయానికి వస్తే అనంతబాబు తన దగ్గర డ్రైవర్ గా ఉన్న సుబ్రమణ్యాన్ని అతని ఇంటి నుంచే తీసుకు వచ్చి చంపేసి మళ్ళీ తన కారులోనే అదే ఇంటికి తీసుకెళ్ళి అప్పగించారు అని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఒక క్రైం సినిమాను తలపించేలా ఉంది ఈ స్టోరీ. ఇలా రియల్ లైఫ్ లో ఎవరైనా చేయగలరా చేయడానికి ఎన్ని గట్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ అనంతబాబుకు అవి ఉన్నాయనే చేశారు అని అన్న వారూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ. దాంతో ఆయన తప్పించుకుందామనుకున్నా చట్టం మాత్రం చూస్తూ ఊరుకోలేదు, నిజాలు అన్వేషించి ఆయన మీద పలు సెక్షన్లతో కేసు పెట్టింది.
దాంతో బెయిల్ రాలేదు. జైలు గోడల మధ్య దాదాపుగా తొమ్మిది నెలల పాటు అనంతబాబు గడిపారు. మొత్తానికి బెయిల్ వచ్చింది. దాంతో అనంతబాబుకు గొప్ప ఊరట లభించింది. ఆయన జైలు గోడలను దాటుకుని బాహ్య ప్రపంచంలోకి ఇలా అడుగు పెట్టారో లేదో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
మరి అనంతబాబును వెల్ కం చెప్పడనికి ఎదురొచ్చిన జనాన్ని చూసి జైలు అధికారులే అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందట. అనంతబాబు అయితే ముకులిత హస్తాలతో అందరికీ దండాలు పెట్టుకుంటూ తన అభిమాన జనం తెచ్చిన దండలను వినయంగా తల వంచి మెడలో వేసుకుంటూ కారులో ముందుకు సాగిపోయారు.
దీని మీద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. హత్య చేసిన ఎమ్మెల్సీని వైసీపీ రక్షిస్తోందని, ఆయన జైలు నుంచి బయటకు వస్తే ఇంతటి మర్యాదలా అంటూ మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, శాంతి భద్రతలు పూర్తిగా కరవు అయ్యాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే జరగాల్సింది జరుగుతోంది. రాజు గారు ఎంత వగచినా అదే కదా జరిగేది.
Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.