లేటు వయసులో పుట్టే ఘాటు ప్రేమలకు నిజంగానే వావి వరసులు, మంచీ చెడులు పెద్దగా పట్టవనే చెప్పాలి. ఈ మాటను నిజం చేస్తూ అప్పటికే అమ్మమ్మ హోదాలోకి మారిపోయి.. ఏకంగా ఆరుగురు పిల్లలతో అమ్మమ్మ అని పిలుపించుకుంటున్న ఓ మహిళ... కూతురు కాపురంలో నిప్పులు పోసి... ఏకంగా అల్లుడినే లేపుకెళ్లిపోయింది. వెరసి ఇద్దరు పిల్లలతో, భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన కూతురుని ఒంటరిని చేసింది. అంతేకాకుండా ఏళ్లుగా తనకు తోడుగా నిలిచిన భర్తను ఏకాకిని చేసింది. ఈ వింత ఘటన ధనిక దేశంగా, ఆధునిక సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా విలసిల్లుతున్న ఇంగ్లండ్ లో చోటుచేసుకుంది. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
ఇంగ్లండ్ కు చెందిన జార్జినా అనే మహిళ వయసు 44 ఏళ్లు. భర్తతో కలిసి సంసార సాగరాన్ని సంతోషంగా ఈదుతున్న ఈవిడ తన పిల్లలకు అప్పటికే పెళ్లిళ్లు కూడా చేసేసింది. తన పిల్లలకు పిల్లలు కూడా కలిగారు. అంటే... ఇప్పుడామె తల్లి, అత్త పాత్రలను దాటుకుని అమ్మమ్మ హోదాలో ఉందన్న మాట. ఈమె పిల్లల్లో జెస్ ఆల్డ్రిడ్జ్ కు 24 ఏళ్లు. రియాన్ ఆల్డ్రిడ్జ్ తో ఏళ్లుగా ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో ఆల్డ్రిడ్జ్ జంటకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా... తాజాగా జెస్ మరోమారు గర్భం దాల్చింది. ఇలాంటి సమయంలో జెస్ కు కాస్తంత ఉపశమనంగా ఉంటుందని భావించిన రియాన్... భార్యతో కలిసి అత్త గారింటికి చేరాడు. తన ఇంటికి వచ్చిన గర్భవతిగా ఉన్న కూతురి బాగోగులు చూసుకోవాల్సిన జార్జినా... అల్లుడిని ముగ్గులోకి దించేసింది. లేటు వయసు ఘాటు ప్రేమ కదా. అత్త గారి ప్రేమకు అల్లుడు కూడా దాసోహమయ్యాడు. నెలలు నిండిన జెస్ ను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత వీరిద్దరూ ఎంచక్కా... లేచిపోయి... ఎక్కడో వేరే ఊరిలో కాపురం పెట్టేశారు.
ఇదేమీ తెలియని జెస్.. తన రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరింది. తీరా ఇంటికి వచ్చాక చూస్తే... ఇంటిలో తండ్రి మినహా తన భర్త గానీ, తల్లి గానీ కనిపించలేదు. ఏమిటాని ఆరా తీస్తే... తల్లి, భర్తల ప్రేమ భాగోతం, వారిద్దరూ చేసిన ఘన కార్యం తెలిసి వచ్చిందట. దీంతో ఏం చేయాలో తెలియక జెస్ కన్నీరు మున్నీరులా విలపిస్తోంది. సొంత తల్లే తనకు ద్రోహం చేసిందని బాధపడుతోంది. ఎక్కడైనా కూతురు కాపురాన్ని నిలబెట్టే తల్లులు ఉంటారు గానీ..కూతురు కాపురంలో నిప్పులు పోసి.. అల్లుడితో వెళ్లిపోయే తల్లిని చూడలేదని ఆమె వాపోతోంది. అత్తాఅల్లుళ్లిద్దరూ చేసిన ఘనకార్యంతో జెస్ భర్త లేని భార్యగా మిగిలిపోగా... జార్జినా భర్త భార్య లేని భర్తగా మిగిలిపోయారు.