తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా.. వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ షురూ కావటం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం 1500 మంది పోలీసుల్ని కేటాయించినట్లు రాచకొండ సీపీ ఘనంగా ప్రకటించారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గొప్పలు చెప్పారు. అయితే.. ఇందుకు భిన్నమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది.
భారీ భద్రత ఉందని చెప్పుకునే స్టేడియంలోకి ఒక 20 ఏళ్ల కుర్రాడు దూసుకెళ్లటమే కాదు.. కోహ్లీ వద్దకు చేరి.. అతను వారిస్తున్నా వినకుండా ఒక సెల్ఫీ దిగటమే కాదు.. ముద్దాడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులోనూ ఇలానే ఇద్దరు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి కోహ్లీతో సెల్ఫీ దిగారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ.. కడప జిల్లాకు చెందిన మహ్మద్ ఖాన్ మైదానంలోకి దూసుకెళ్లి కోహ్లీని ముద్దాడి వార్తల్లోకి వచ్చాడు.
శుక్రవారం ఉదయం కడప నుంచి సికింద్రాబాద్కు రైల్లో వచ్చిన ఈ 20 ఏళ్ల కుర్రాడు వంద రూపాయిలు పెట్టి మ్యాచ్ టికెట్ తీసుకున్నాడు. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నట్లు కనిపించగానే.. స్టాండ్స్ నుంచి వచ్చే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి.. మైదానంలోకి దూసుకెళ్లటమే కాదు.. కోహ్లీ వద్దకు నేరుగా చేరుకొని అతడు వారిస్తున్నా వినకుండా సెల్ఫీ దిగాడు. అనంతరం హగ్ చేసుకొని.. ముద్దాడాడు.
తాను అనుకున్న పని పూర్తి అయిందన్న సంతోషంతో చేతులు ఊపుతూ తన ఆనందాన్ని ప్రకటించాడు. తనకు కోహ్లీ అంటే ప్రాణమని.. ఏం జరిగినా ఫర్లేదనుకొనే తాను అలా చేసినట్లుగా మహ్మద్ వెల్లడించాడు. అతడిపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుల సంగతి తర్వాత.. అభిమాని కావటంతో ఇక్కడితో ఆగింది. అదే.. ఏ మాత్రం సంఘ వ్యతిరేక శక్తి అయితే.. ఏం కాను..?