ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేశారు. అలాగే తమిళనాడుకు కూడా అలా వెళ్లొచ్చారు చంద్రబాబు. కర్ణాటకలో బాబు జేడీఎస్ కు - కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక తమిళనాట డీఎంకే- కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు.
అయితే బాబు ప్రచార పర్వం ఇంతటితో ఆగదని ముందే ప్రకటించారు. తను దేశమంతా తిరిగి ప్రచారం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించుకున్నారు.
మరి రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఈ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా కాంగ్రెస్ కు దగ్గరై పోయినట్టుగా కనిపిస్తున్నాయి. లోపల ఏం జరుగుతున్నా పైకి అయితే బాబు కాంగ్రెస్ కు దగ్గరైనట్టుగా కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తో కొన్ని పార్టీలు దూరాన్ని పాటిస్తూ ఉన్నాయి.
ఇక మమతా బెనర్జీ అయితే ఫెడరల్ ఫ్రంట్ పాట ఎత్తుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని పార్టీలు చంద్రబాబుతో ఎలా వ్యవహరిస్తాయి అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ల మధ్యన కూడా దూరం పెరిగింది. కాంగ్రెస్- ఆప్ ల పొత్తు లేదని తేలిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ - మమతా బెనర్జీలు చంద్రబాబు నాయుడును ఎన్నికల ప్రచారానికి పిలవబోతూ ఉన్నాయా? లేక బాబు ప్రచార పర్వం తమిళనాడు - కర్ణాటకలతోనే ఆగిపోతుందా? అనేది చర్చనీయాంశంగా అవుతోంది. కాంగ్రెస్ తో బాబు దగ్గరై పోయారు - అదే కాంగ్రెస్ తో టీఎంసీ - ఆప్ ల దూరం పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో బాబును ఆ పార్టీలు ఇక ఎలా ట్రీట్ చేయబోతున్నాయో!