ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆప్.. విషయంలో ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీలో పట్టుబట్టి అధికారంలోకి వచ్చిన మాజీ బ్యూరోక్రాట్.. కేజ్రీవాల్.. వరుసగా రెండోసారి కూడా అధికారాన్నినిలబెట్టుకున్నారు. అంతేకా దు.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ పార్టీ..రెండు తెలుగు రాష్ట్రాల్లోని రిటైర్డ్ బ్యూరోక్రాట్లకు పునరావాస కేంద్రంగా మారిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఆప్ తదుపరి లక్షిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని.. విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లతో ఆప్ నేతలు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఆప్‌కి మాజీ బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆయనకు విస్తృతమైన నెట్ వర్క్ ఉంది. అదేవిధంగా ఎంతో మంది మాజీలు పరిచయం ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత మరియు రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు కేజ్రీవాల్ లేదా అతని పార్టీ సభ్యులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అదే సమయంలో, కేజ్రీవాల్‌కు ఈ బ్యూరోక్రాట్ల పరిపాలనా నైపుణ్యాలపై నమ్మకం ఉండడం కూడా కలిసివస్తున్న పరిణామంగా చెబుతున్నారు.
పార్టీలో ఈ అధికారులకు ప్రముఖ స్థానాలు ఇవ్వడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల, కర్ణాటకలో, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బెంగళూరు మాజీ నగర కమిషనర్ భాస్కర్ రావు ఆప్‌లో చేరారు. దీంతో ఆయనకు.. పార్టీ నుండి ఎమ్మెల్యే టిక్కెట్టు హామీ ఇచ్చారు. మరో రిటైర్డ్ అధికారి (స్వచ్ఛంద) మథాయ్ ఇటీవల కర్ణాటకలో ఆప్‌లో చేరారు.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు అధికారులు ఆప్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని ఆఫర్ చేశారని తెలిసింది. ఇక, తెలంగాణాలో కూడా ఇప్పటికే సొంత పార్టీ పెట్టిన రిటైర్డ్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను ఆప్‌లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు సమాచారం.
అదేసమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తన పార్టీని ఆప్‌లో విలీనం చేసేందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ విలీనం పార్టీకి ఊపునిస్తే, తెలంగాణలోని ఆప్‌లో మరింత మంది బ్యూరోక్రాట్లు చేరతారని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, తెలుగు రాష్ట్రాల రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లకు ఆప్ మొదటి ఎంపికగా మారడం.. సంచలనంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.