అల్లు అర్జున్ రూ.25 కోట్లు.. రష్మిక రూ.15 లక్షలు.. రేవంత్ సీరియస్!

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు.

Update: 2024-12-23 03:58 GMT

శనివారం తెలంగాణ అసెంబ్లీలో.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా... బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్ చేస్తానన్న ఆర్థిక సాయం ఇంకా చేయలేదనే విషయం తెరపైకి రావడంతో.. ఆ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓయూ జేఏసీ కీలక డిమాండ్లు చేసింది.

అవును... ఆదివారం నాడు అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ ముట్టడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్న పూల కుండీలు ధ్వంసం అవ్వగా... రాళ్లు, టమాటాలతో దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో... అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా 8 మంది ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే... దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జున్ లేరని అంటున్నారు. అనంతరం అక్కడకు చేరుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి.. సెక్యూరిటీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరోపక్క... తమపై అల్లు అర్జున్ సిబ్బంది దాడి చేశారని ఓయూ జేఏసీ నేతలూ ఆరోపిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి సహాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన చేస్తే.. అల్లు అర్జున్ సిబ్బంది దాడి చేశారని.. ఓయూ జేఏసీ నేత ఆరోపించారు. ఈ సందర్భంగా కీలక డిమాండ్లు తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్ ఇప్పటికైనా రూ.25 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాకానిపక్షంలో ఈసారి 1,500 మందితో వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముడతామని హెచ్చరించారు! ఇదే సమయంలో.. హీరోయిన్ రష్మిక మందన్న కూడా బాధ్యత తీసుకుని రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి సీరియస్!:

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా... సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, సిటీ పోలీస్ కమీషనర్ ను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అన్నారు. .

ఇదే సమయంలో.. అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన ఏసీపీ విష్ణుమూర్తి వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్థావించినట్లు స్పందించిన రేవత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News