ఎమ్మెల్యేకు న్యూ*డ్ కాల్.. రికార్డ్ చేసి డబ్బుల డిమాండ్.. పోలీసులకు ఫిర్యాదు

సైబర్ నేరగాళ్లు ఇలా ప్రముఖులనే టార్గెట్ చేయడం సంచలనమైంది. నేతలు అప్రమత్తంగా లేకపోతే అనర్థాలకు ఇది దారితీయవచ్చు.;

Update: 2025-03-05 04:21 GMT

సహజంగా మనకు ఒక కాల్ వస్తే ఏం చేస్తాం.. ఎవరో అయ్యింటారని లిఫ్ట్ చేస్తాం.. నార్మల్ కాల్ అయినా.. వీడియో కాల్ అయినా.. వాట్సాప్ కాల్ అయినా అదే చేస్తాం. అయితే అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. కొందరు సైబర్ నేరగాళ్లు న్యూ*డ్ కాల్స్ చేసి రికార్డ్ చేసి ఏకంగా ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇలా ప్రముఖులనే టార్గెట్ చేయడం సంచలనమైంది. నేతలు అప్రమత్తంగా లేకపోతే అనర్థాలకు ఇది దారితీయవచ్చు.

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తూ న్యూ*డ్ వీడియో కాల్ చేసి, బ్లాక్ మెయిల్ చేయడం కలకలం రేపింది. ఈ సంఘటనలో సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేకు న్యూ*డ్ కాల్ చేసి, స్క్రీన్ రికార్డు చేసిన వీడియోను ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు.

- ఎంఎల్‌ఏకు న్యూ*డ్ కాల్ - బ్లాక్ మెయిల్

తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గుర్తుతెలియని వ్యక్తులు న్యూ*డ్ వీడియో కాల్ చేశారు. అతి కొద్ది సమయంలోనే ఆ వీడియోను స్క్రీన్ రికార్డు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేకే పంపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను ఇతర కాంగ్రెస్ నేతలకు పంపారు.

- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే తాజాగా పోలీసులను ఆశ్రయించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

-సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే చర్యలు అవసరం

ఇటీవల కాలంలో న్యూ*డ్ వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టడానికి కఠిన చట్టాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేయడం అనేది సర్వసాధారణం.. దాన్నే కేటుగాళ్లు ఆసరాగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై త్వరగా విచారణ జరిపి, నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News