నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యానికి కారణమిదే

Update: 2020-01-16 11:06 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఇప్పుడు దేశాన్నే షేక్ చేసిన నిర్భయ ఉదంతంలో ఉరిశిక్ష జాప్యం కావడంతో కేంద్రంలోని బీజేపీ పై ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొత్త ఆరోపణ చేశారు.

నిర్భయ దోషుల ఉరితీతలో జాప్యం జరగడానికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.

క్షమాభిక్ష పిటీషన్ ను దోషులు దాఖలు చేశారని.. రెండున్నర ఏళ్లలో కేజ్రీవాల్ సర్కారు ఎందుకు నోటీసు జారీ చేయలేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోగా ఆప్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఉంటే ఈ నలుగురు దోషులను ఉరితీసేవారని.. ఈ దేశానికి న్యాయం జరిగి ఉండేదని పేర్కొన్నారు. ఇలా నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యానికి ఢిల్లీ సర్కారు కారణమని కొత్త వాదనను కేంద్ర మంత్రి లేవనెత్తారు.


Tags:    

Similar News