పంజాబ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజారంజక పాలన అవలంభించేందుకు పావులు కదుపుతోంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలని భావిస్తోంది. ఇందుకుగాను ప్రజలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిశ్చయించింది. ఇందుకు గాను జీవో కూడా జారీ చేసింది. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ప్రజలకు తీపి కబురు అందించింది.
ఈ పథకం జులై 1 నుంచి అమల్లోకి రానుందని చెప్పింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .అమ్ ఆద్మీని గెలిపించినందుకు అది ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని సూచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ పథకం ప్రకటించింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలవరించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తీసుకురానుంది. ఢిల్లీలోనూ ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది. దీంతో ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో మంచి గుర్తింపు లభించనుంది.
దీంతో ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. తాను చెప్పిన విధంగా హామీలు నెరవేర్చేందుకు ముందుకు రావడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. మరోవైపు ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసేందుకు మరో పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి కావడం తెలిసిందే.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి.
ఆప్ చీఫ్ అరవింద కేజ్రీవాల్ నేతృత్వంలో ముందుకు వెళుతోంది. ప్రజాభిమానం చూరగొనే పనులు చేసేందుకు నిశ్చయించుకుంది. దీంతో ప్రజల్లో తమ ప్రతిష్ట పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇక మీదట కూడా జరిగే ఎన్నికల్లో ఆప్ కు తిరుగుండకుండా చేసుకునేందకు సిద్ధమైంది. దీనికి ఇచ్చిన హామీలన్ని నెరవేర్చి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తోంది.