ఏపీ రాజకీయాలపై ఆంధ్రజ్యోతి తాజా సర్వే

Update: 2016-11-28 07:16 GMT
తన పొలిటికల్ కెరీర్ లో సుదీర్ఘ కాలం విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆయన పాలన ఎలాఉంది? బాబు పని తీరుపై ఏపీ ప్రజానీకం ఏమంటోంది? ఆయనకు.. ఆయన పార్టీ నేతలపై ప్రజల తీరు ఎలా ఉంది? విపక్ష నేత విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలిచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో సగం ప్రయాణం పూర్తి అయిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలేమిటన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రముఖ మీడియాసంస్థ ఆంధ్రజ్యోతి తాజాగా ఒక సర్వే నిర్వహించింది.

తన సర్వేలతో ఫేమస్ అయిన లగడపాటి రాజగోపాల్ తరచూ సర్వే చేయించే ఫ్లాష్ టీంతో జత కట్టిన ఆంధ్రజ్యోతి తాజాగా తాను నిర్వహించిన సర్వే వివరాల్ని వెల్లడించింది. మరి.. తాజా సర్వే ఏం చెబుతుందన్నది రెండు ముక్కల్లోచెప్పాలంటే.. బాబుపై ప్రజల్లో ధీమా చెరగలేదని.. అదే సమయంలో జగన్ మీద నమ్మకం పెరగలేదని.. ఇక.. రాజకీయాల్లో సీరియస్ గా ఉంటూ 2019 బరిలోకి దిగుతానన్న పవన్ కల్యాణ్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉందన్నట్లుగా తాజా సర్వే చెబుతుందని చెప్పాలి.

తాము చేసిన సర్వే గురించి జ్యోతి వెల్లడించిన వివరాల్ని చూస్తే..

= గత ఎన్నికలతో పోలిస్తే.. తాజాగా జరిపిన సర్వేను చూస్తే.. మెజార్టీ ప్రజల మొగ్గు తెలుగుదేశం పార్టీ మీదనే ఉన్నప్పటికీ.. ఓట్లశాతం మాత్రం పెద్దగా పెరగవన్న విషయాన్ని సర్వే వెల్లడించింది.

= ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ.. బీజేపీ కూటమికి వచ్చే అసెంబ్లీ స్థానాల సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉందన్న మాటను స్పష్టం చేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 102.. బీజేపీకి నాలుగు సీట్లు రాగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేమాత్రం 120 సీట్లు వచ్చే వీలుందని సర్వే స్పష్టం చేసింది.

= ఓట్ల శాతం పెరగకుండా.. సీట్లు పెరగటానికి కారణం.. విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీమరింత బలోపేతం కావటమేనని సర్వే తేల్చింది.

= జగన్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఓట్లు.. సీట్లు  కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

= సర్వే జరిపిన 23 నియోజకవర్గాల్లో  2014లో వైఎస్సార్ కాంగ్రెస్ కు 43.2 శాతం ఓట్లు వచ్చాయి.

= 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఓట్ల శాతం 36.8కి తగ్గిపోవటమే కాదు.. సీట్ల సంఖ్య కూడా యాభైకి పడిపోతుందని తేల్చారు.

= మొత్తం అసెంబ్లీ స్థానాల్లో సర్వే నిర్వహించనప్పటికీ.. వివిద ప్రాంతాలు.. అక్కడి రాజకీయ అంశాలు.. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకొని 23 అసెంబ్లీ స్థానాల్లో శాస్త్రయంగా సర్వే నిర్వహించారు.

= సర్వే నిర్వహించిన 23 జిల్లాల్లో 16 జిల్లాలు తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 7 స్థానాలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. ఇప్పుడున్న బలాబలాల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. అన్నే సీట్లు ఈ రెండు పార్టీలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. గెలిచే నియోజకవర్గాల్లో మాత్రం మార్పు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

= అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మాత్రం ఫలితాల్లో తేడా వచ్చే వీలుందని చెప్పింది.

= గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్ కాంగ్రెష్ కు 6.4 శాతం ఓట్లు తగ్గుతాయని సర్వే పేర్కొంది. ఈ కారణంతో జగన్ పార్టీ 14 నుంచి 17 సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఆ సీట్లు టీడీపీ.. బీజేపీ ఖాతాలో పడతాయన్న అంచనా వేసింది.

= ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సర్వే చేసిన 23 నియోజకవర్గాల్లో 11 చోట్ల కూటమి బలపడితే.. మరో 11 చోట్ల కూటమి బలం తగ్గింది. అయితే.. తగ్గిన చోట జగన్ పార్టీ బలపడకపోవటం గమనార్హం  అంతే.. కూటమి పోగొట్టుకున్న ఓట్లను జగన్ కాకుండా మరో వర్గం సొంతం చేసుకుందన్న మాట. అంటే.. బహుముఖ పోరుకు ఇదో సంకేతంగా చెప్పింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవటం టీడీపీకి కొంతమేర లాభం చేకూరే అవకాశం ఉందని చెప్పారు.

= మైనార్టీలు అధిక్యత ఉన్న ప్రాంతాల్లో జగన్ అధిక్యం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక.. రాష్ట్ర విభజనలో కీలకభూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ కోలుకునే దాఖలాలు కనిపించటం లేదు. కొంతలో కొంత సానుకూలాంశం ఏమిటంటే..2014 ఎన్నికల్లో వచ్చిన 2.57 శాతం ఓట్లతో పోలిస్తే.. 2019లో 6.1 శాతానికి ఓట్లు పెరిగే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

= జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పెట్టే సభల్లోజనం పోటెత్తుతున్నా.. ఓట్ల రూపంలో మారే అవకాశం మాత్రం కనిపించటం లేదని సర్వే తేల్చింది. ఆయనకు ప్రజల్లో ఆదరణ పెద్దగా లేదని.. దాదాపు 4 శాతం మందే జనసేనకు మద్దతు పలుకుతున్నట్లుగా సర్వే తేల్చింది. పవన్ కు మద్దుతుగా నిలిచిన వారిలోవిద్యార్థులే అధికంగా ఉన్నట్లుగా పేర్కొంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News