గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మొత్తం 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 216 కేసులు యాక్టివ్ గా ఉండగా - 8 మంది కరోనా బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న గుంటూరు నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది.
క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29 - 30 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా ఎవరు బయటకి వచ్చినా కూడా 14 రోజులు క్వారంటైన్ తప్పదు అని హెచ్చరిస్తున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ అని ప్రకటించడంతో నరసరావుపేటలోని వరవకట్టు ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్ లతో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. సివిల్ - ఏపీఎస్పీ - ఏఆర్ - ఏఎన్ ఎస్ పోలీసులు పేటలో 24/7 గస్తీ కాస్తున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరు పోలీస్ ఆంక్షలకు లోబడి నడుచుకోవాలని రూరల్ ఎస్పీ, విజయరావు స్పష్టం చేశారు.