బిగ్ రిలీఫ్‌: ఇకపై సెకన్లలో మహమ్మారి టెస్టు రిజల్ట్!

Update: 2020-05-21 10:50 GMT
ప్రస్తుతం ప్రపంచమంతా భయంకరమైన వైరస్ తో అతలాకుతలమవుతున్న సమయంలో, ఆ వైరస్ బాధితులను గుర్తించేందుకే ఎన్నో ఆపసోపాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ పరీక్షలు చేస్తే ఫలితాల కోసం గంటలు..రోజుల కొద్ది వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఎలాగో అలాగా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తూనే వుంది.

ఇప్పటికే మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి తగ్గాలి అంటే, వైరస్ టెస్టు ఫలితాలు వేగంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో అబుదాబిలో కరోనా వైద్య పరీక్ష ఫలితాలు సెకండ్లలోనే తేలే పరికరాన్ని కనిపెట్టారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాక్సిన్ రావాలి అంటే చాలా నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈలోగా వైరస్ వైరస్ వ్యాప్తి ని నియంత్రించాలంటే కరోనా వైరస్ ఉన్న వ్యక్తిని ముందుగా కనిపెట్టి, అతనికి వైద్యం అందించాల్సి వుంటుంది.

దాంతో వేగంగా ఫలితం తేలే వైరస్ టెస్టు కిట్ల రూపకల్పనపై పలు దేశాలు దృష్టి సారించాయి. ఆలా త్వరగా వైరస్ ను కరోనా వైరస్ సోకిన వారిని వేగంగా గుర్తిస్తే, కనీసం వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షా ఫలితాలు సెకన్లలో వచ్చేలా ఒక డివైస్ ని అభివృద్ధి చేసామని ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ వైద్య-పరిశోధనా విభాగమైన క్వాంట్‌ లేస్ ఇమేజింగ్ ల్యాబ్, ఐహెచ్సీ ప్రకటించింది. ఈ పురోగతితో మాస్-స్కేల్ స్క్రీనింగ్‌ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

వైరస్ సోకిన రక్తం యొక్క కణ నిర్మాణంలో మార్పును అధ్యయనం చేసుకొని… సీఎంఓఎస్ డిటెక్టర్ ‌ను ఉపయోగించే పరికరాలు, ఫలితాలతో మాస్-స్కేల్ స్క్రీనింగ్‌ ను ఉపయోగించి…సెకన్లలోనే కరోనా పరీక్ష ఫలితాలు తెప్పిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి, ఆప్టికల్-ఫేజ్ మాడ్యులేషన్ ఆధారంగా లేజర్-ఆధారిత డిపిఐ టెక్నిక్ కొన్ని సెకన్లలోనే సంక్రమణ సిగ్నేచర్ ఇవ్వగలదని డాక్టర్ చెప్పారు.
Tags:    

Similar News