ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. కోర్టు కస్టడీకి ఇవ్వడంతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలోనే విచారణ చేస్తున్నారు. అక్కడే అచ్చెన్నను ఏసీబీ విచారించగా పలు కీలక అంశాలను ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ విచారణలో ఈఎస్ఐ మందుల కొనుగోలు, పరికరాల కొనుగోళ్ల సమయంలో తాను మంత్రిగా లేనని అచ్చెన్నాయుడు చెప్పినట్టు సమచారం. తాను పొరుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో అధ్యయనం చేయాలని మాత్రమే సూచించానని తెలిపారట.. మినిట్స్ పై మాత్రమే సంతకం పెట్టాను అని వివరించారట..
మినిట్స్ లో టెలీహెల్త్ సర్వీసెస్ కొనుగోళ్లకు సంబంధించి ఓ కంపెనీకే సిఫార్స్ చేశారా? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కుటుంబ ఆస్తులు, ఆదాయం ఎంత అని కూడా ప్రశ్నించారు.
ఇక అచ్చెన్నకు ఆపరేషన్లు జరిగాయని.. రాత్రివరకు విచారణ చేయడంపై అచ్చెన్నాయుడు లాయర్ అభ్యంతరం తెలిపారు. సాయంత్రం వరకే విచారణ జరపాలని కోరారు. శుక్ర, శనివారాల్లో ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.