ఏపీ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి గతంలోఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే , ఆ సమయంలో చంద్రబాబు హైకోర్టు ను ఆశ్రయించి స్టే పొందారు. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆ స్టే తొలిగిపోయినట్లుగా తెలిపింది. అదే సమయంలో లక్ష్మి పార్వతి, మరోసారి చంద్రబాబు పై విచారణ జరపాలి అని మరో పిటిషన్ వేశారు. అలాగే ఇదే నేపథ్యం లో స్టే సమయం కూడా ముగియడంతో ఏసీబీ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.
ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు.. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టులో చంద్రబాబుకు ఇచ్చిన స్టే వివరాలను కోర్టు కు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లోనే లక్ష్మీ పార్వతి ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఇక, చంద్రబాబు రిట్ పిటీషనర్ దాఖలు చేయటం తో దాని పైన విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తి వేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. ఇకపోతే , చంద్రబాబు నాయుడు పై ఎప్పటి నుంచో లక్ష్మీ పార్వతి అవినీతి అరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించేవారు.