తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆయన సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి నివాసంపై ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదాయపన్ను సక్రమంగా కట్టటం లేదన్న ఆరోపణతో హైదరాబాద్ లోని ఆయన నివాస.. కార్యాలయాలతో పాటు నల్గొండ.. కాకినాడలోని కార్యాలయాలపై ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించటం గమనార్హం.
నల్గొంగ శాసనసభ్యుడైన కోమటిరెడ్డి దగ్గర భారీగా అప్రకటిత ఆస్తులు ఉన్నాయని.. వాటి మీద కన్నేసిన ఐటీ అధికారులు.. విశ్వసనీయ సమాచారం అందుకొనే తాజా దాడులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ నేతగా సుపరిచితులైన కోమటిరెడ్డి బ్రదర్స్ కు పలు వ్యాపారాలు ఉన్నట్లు చెబుతారు. తన సోదరుడితో కలిసి ఇన్ ప్రాస్ట్రక్చర్.. మైనింగ్ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులపై దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యగా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించుకోవటం కనిపిస్తుంది. కారణం ఏమైనా కానీ.. ప్రస్తుతం అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ ట్రబుల్స్ లో చిక్కుకున్నట్లేనని చెప్పక తప్పదు.