ఓటుకు నోటు వ్యవహారంలో ఈ రోజు (గురువారం) కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? వారం క్రితం వరకూ వినిపించినట్లుగా ఈ కేసుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారా? ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యిందా? లాంటి ప్రశ్నలకు రాజకీయ వర్గాల్లో అవుననే మాట బలంగా వినిపిస్తోంది.
అయితే.. నోటీసులు అధికారుల నుంచి నేరుగా కాకుండా.. కోర్టు నుంచి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు గొంతుగా చెబుతున్న ఆడియో టేపును ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలిస్తే.. అవి బాబు మాటలుగానే ఉన్నట్లు తేలినట్లుగా చెబుతున్నారు.
ఈ టేపులపై ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించి.. అక్కడ నుంచి ఆ కాపీని అధికారికంగా ఏసీబీ తీసుకుంటుందని.. ఈ నేపథ్యంలో ఈ కేసు వ్యవహారంలో భాగం ఉందంటూ విచారణకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తారని చెబుతున్నారు.
అయితే.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. ఈ విషయంలో గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చే వరకూ వ్యవహారం వెళ్లదని కొందరు నేతలు బలంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.