హత్రాస్ బాధితురాలి గుర్తింపును వెల్లడించిన వారిపై చర్యలు

Update: 2020-10-05 01:30 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురైన దళిత యువతి గుర్తింపును వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. ఆమె గుర్తింపును నటి స్వరభాస్కర్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ వెల్లడించినట్టు సమాచారం.

ఐపీసీ సెక్షన్ ప్రకారం రేప్ కు గురైన బాధితురాలి పేరుగాని.. ఆమె వివరాలు కానీ వెల్లడించడం నిషేధం. ఈ క్రమంలోనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, నటి స్వరభాస్కర్ తదితరులు బాధితురాలి గుర్తింపును వెల్లడించినట్లు తమ వద్ద సమాచారం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు.

అత్యాచారానికి గురైన మహిళలు, బాలల పేర్లు, ఇతర వివరాలను వెల్లడించడం నేరం. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయంపై స్వీయ విచారణ జరుపుతున్నామని దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ వెల్లడించింది.

కాగా బాధితురాలిపై అమిత్ మాలవీయ ఈనెల 2న వీడియోను ట్వీట్ చేశారు. ఇది తీవ్ర సంచలనమైంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News