తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. లారెన్స్ - విశాల్ తో పాటు సినీరంగానికి చెందిన మరి కొంతమంది ప్రముఖులు తలైవాకు మద్దతు ప్రకటించారు. అయితే, అదే సమయంలో కొంతమంది రాజకీయ నేతలు రజనీపై విమర్శలు కురిపించడం కూడా మొదలెట్టేశారు. అయితే, తాజాగా తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ....రజనీ రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తలైవాపై శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమ సినిమాల విడుదల సమయంలో కేవలం పబ్లిసిటీ కోసం రజనీకాంత్ రాజకీయాలను తెరపైకి తెచ్చారని శరత్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. అయితే, రాజకీయాల్లోకి సామాన్యుడి నుంచి సెలబ్రిటీవరకు ఎవరైనా రావచ్చని ఓ పక్క చెబుతూనే.....రజనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రజనీకాంత్ నొక్కి వక్కాణిస్తున్న ఆధ్యాత్మికత - సెక్యులరిజం గురించి తెలియాలంటే....ఎన్నికల సమయం వరకు వేచిచూడాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రజనీకి చాలామంది మద్దతు తెలుపుతున్నారని, అయితే, ఎన్నికల వేడి రాజుకున్నాక ఆయన వెనకున్న రాజకీయ శక్తులు బయటకు వస్తాయని బీజేపీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తమిళులు - కన్నడిగుల మధ్య కావేరి - మేగదారు వంటి అనేక వివాదాల సమయంలో రజనీకాంత్ ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా, రజనీకి ధైర్యం ఉంటే త్వరలో జరగబోతోన్న కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయగలరా అంటూ ప్రశ్నించారు. జయలలిత, కరుణానిధి లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు రజనీకాంత్ ఎందుకు ఎన్నికలలో పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలని, యువతకు దారివ్వాలని హితవు చెప్పిన విశాల్ రజనీకి మద్దతు తెలపడం పై కూడా శరత్ కుమార్ స్పందించారు. యువతకు పెద్దపీట వేయాలన్న విశాల్....ఆ విషయాన్ని రజనీకాంత్ చెవిలో చెబుతారా అంటూ....శరత్ కుమార్ ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రోజే తన అభిమానులు సంయవనం పాటించాలని రజనీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులు.....శరత్ కుమార్ పై ఏవిధంగా స్పందిస్తారో అన్న విషయం ఆసక్తిగా మారింది.